ఆదివారం నాడు మలేసియా మాస్టర్స్ ఫైనల్ లో భారత స్టార్ షట్లర్ సింధు
ఆదివారం నాడు మలేసియా మాస్టర్స్ ఫైనల్ లో భారత స్టార్ షట్లర్ సింధుకు నిరాశ ఎదురైంది. చైనాకు చెందిన ప్రపంచ 7వ నెంబర్ ర్యాంకర్ వాంగ్ ఝీ యితో జరిగిన పోరులో పివి సింధు ఓటమిపాలైంది. గత రెండేళ్లుగా సింధుకు టైటిల్ దక్కడం లేదు.
వాంగ్ జీయీ చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. మొదటి గేమ్‌లో ఆధిపత్యం కనబరిచిన సింధు.. ఆ తర్వాత రెండు, మూడు గేమ్‌లను కోల్పోయింది. మొదటి గేమ్‌లో అద్భుతంగా ఆడిన సింధు.. రెండో గేమ్‌లో ఆ దూకుడుని ప్రదర్శించలేకపోయింది. ఇక మూడో గేమ్‌ను సింధు దూకుడుగా ఆరంభించినా వాంగ్ జీయీ అద్భుత రీతిలో ఆడి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు మలేసియా మాస్టర్స్ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకోవాలనుకున్న సింధుకి నిరాశే ఎదురైంది. ఒలింపిక్స్‌లో గత రెండు ఎడిషన్లలో రజతం, కాంస్య పతక విజేత అయిన సింధు గతేడాది ఆర్కిటిక్ ఓపెన్‌లో వాంగ్ చేతిలో ఓడిపోయింది, అయితే మూడు మ్యాచ్ లలో రెండుసార్లు ఆమెను ఓడించింది. కానీ మలేసియా మాస్టర్స్ ఫైనల్ లో మాత్రం సింధు విజయాన్ని దక్కించుకోలేకపోయింది