Punjab Kings Beat Chennai Super Kings : నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి చెన్నైపై గెలిచిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్-2023లో 41వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి పంజాబ్ కింగ్స్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ విజయం కోసం బ్యాటింగ్‌లో ఎందరు రాణించినా.. చివరి బంతికి విన్నింగ్ షాట్ కొట్టి సికందర్ రజా హృదయాలను గెలుచుకున్నాడు. రజా 7 బంతుల్లో 13 నాటౌట్‌గా నిలిచాడు.

Punjab register highest successful chase against Chennai at Chepauk as Raza holds his nerves
ఐపీఎల్-2023లో 41వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings).. పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో తలపడింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి పంజాబ్ కింగ్స్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ విజయం కోసం బ్యాటింగ్‌లో ఎందరు రాణించినా.. చివరి బంతికి విన్నింగ్ షాట్ కొట్టి సికందర్ రజా(Sikander Raza) హృదయాలను గెలుచుకున్నాడు. రజా 7 బంతుల్లో 13 నాటౌట్‌గా నిలిచాడు. ఈ 13 పరుగులు మ్యాచ్ గెలుపుకు అవసరమయ్యాయి. అందుకే చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్(Punjab) నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌కు రుతురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad), డెవాన్ కాన్వే(Devon Conway) మరోసారి శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 9.4 ఓవర్లలో 86 పరుగులు జోడించారు. రుతురాజ్ 37 పరుగులు చేసి అవుటవ్వగా.. డెవాన్ కాన్వే 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 52 బంతుల్లో అజేయంగా 92 పరుగులు చేశాడు. శివమ్ దూబే(Shivam Dubey) 17 బంతుల్లో 28 పరుగులు చేశాడు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఎంఎస్ ధోని కూడా 4 బంతుల్లో 13 పరుగులు చేశాడు. చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదిన ధోనీ జట్టు స్కోరును 200కు చేర్చాడు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమి ఖాయంగా కనిపించింది. చివరి 6 ఓవర్లలో జట్టు విజయానికి 82 పరుగులు అవసరం. ఆ సమయంలో లియామ్ లివింగ్‌స్టోన్(Laim Livingstone) తుషార్ దేశ్‌పాండే వేసిన ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 22 పరుగులు చేశాడు. ఆ ఓవర్‌లో లివింగ్‌స్టోన్ ఔటైనా.. విజయంపై ఆశలు పెంచాడు. సామ్ కరణ్(Sam Curran) 20 బంతుల్లో 29 పరుగులు, జితేష్ శర్మ(Jithesh Sharma) 10 బంతుల్లో 21 పరుగులు చేసి పోరాటాన్ని కొనసాగించారు. చివరి ఓవర్‌లో సీఎస్‌కే బౌలర్ బౌలింగ్ రాగా.. విజయానికి 9 పరుగులు కావాలి. తొలి ఐదు బంతులకు ఐదు పరుగులు తీశారు. చివరి బంతికి మూడు పరుగులు కావాలి. అందరిలో ఒకటే ఉత్కంఠ.. కానీ సికందర్ రజా మ్యాచ్ విన్నింగ్ షాట్ ఆడి మూడు పరుగులు తీసి పంజాబ్ కింగ్స్‌కు భారీ విజయాన్ని అందించాడు.
