PBKSvsRR థ్రిల్లర్ లో విన్నర్ గా నిలిచిన రాజస్థాన్
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 147 పరుగులు చేసింది
పంజాబ్ కింగ్స్ మీద రాజస్థాన్ విజయం సాధించింది. 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రాజస్థాన్ తరపున యశస్వి జైస్వాల్ (39), తనుష్ కోటియన్ (24) పరుగులతో రాణించారు. ఆ తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్ (18), రియాన్ పరాగ్ (23), ధ్రువ్ జురెల్ (6) విఫలమైనా ఆఖర్లో హెట్మేయర్ (27), రోమన్ పావెల్ (11) విన్నింగ్ రన్స్ కొట్టారు. పంజాబ్ బౌలింగ్ లో రబాడా, సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టారు. అర్ష్ దీప్ సింగ్, లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్ తలో వికెట్ సాధించారు. లో స్కోరింగ్ మ్యాచ్ అయినా ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 147 పరుగులు చేసింది. అశుతోష్ శర్మ 31, లివింగ్ స్టన్ 21, జితేశ్ శర్మ 29 పరుగులు చేశారు. చివర్లో అశుతోష్ శర్మ 16 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులు బాదాడు. శామ్ కరన్ (9), శశాంక్ సింగ్ (9), ఓపెనర్లు జానీ బెయిర్ స్టో (15), అథర్వ తైదే (15) ఘోరంగా విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో అవేష్ ఖాన్ 2, కేశవ్ మహరాజ్ 2, ట్రెంట్ బౌల్ట్ 1, కుల్దీప్ సేన్ 1, చహల్ 1 వికెట్ తీశారు.