Punjab Kings Beat Delhi Capitals : ప్రభ్‌సిమ్రాన్ సింగ్ సెంచరీ.. ఢిల్లీపై గెలిచిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్-2023 59వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించడం ద్వారా ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్‌లో ఓటమితో ఈ సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఢిల్లీ జట్టు నిలిచింది. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇక్కడ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు తొలి ఓవర్ లోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ శిఖర్ ధావన్.. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో అవుటయ్యాడు.
ఐపీఎల్-2023 59వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab kings), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను ఓడించడం ద్వారా ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్‌లో ఓటమితో ఈ సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించిన మొదటి జట్టుగా ఢిల్లీ(Delhi) జట్టు నిలిచింది. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఇక్కడ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడిన బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్(Punjab)కు తొలి ఓవర్ లోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ శిఖర్ ధావన్(shikar Dhawan).. ఇషాంత్ శర్మ(Ishant Sharma) బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత లియామ్ లివింగ్‌స్టోన్(Liam Livingstone) కూడా విఫలమయ్యాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(Prabhsimran Singh) 19వ ఓవర్ వరకు క్రీజులో ఉన్నాడు. సింగ్ 65 బంతుల్లో 103 పరుగులు చేసి తొలి ఐపీఎల్ సెంచరీ(IPL Century)ని నమోదు చేసుకున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
అనంతరం ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు డేవిడ్ వార్నర్(David Warner), ఫిల్ సాల్ట్(Philip Salt) అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఈజీగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. వార్నర్ అర్థసెంచరీతో మ్యాచ్ ఢిల్లీ వైవే ఉంది. కానీ హర్‌ప్రీత్ బ్రార్(Harpreeth Brar) నాలుగు వికెట్లు తీసి ఢిల్లీ ఆశలన్నింటినీ తుడిచిపెట్టాడు. అతనికి తోడు రాహుల్ చాహార్(Rahul Chahar) (2 వికెట్లు), నాథన్ ఇల్లీస్(2 వికెట్లు) కూడా విజృంబించారు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ ఓటమి తర్వాత ఢిల్లీ జట్టు ఎప్పటిలాగే చివరి స్థానంలో ఉంది. 12వ మ్యాచ్‌లో ఎనిమిదో ఓటమిని చవిచూసింది. పంజాబ్‌కు 12వ మ్యాచ్‌లో ఇది ఆరో విజయం. ఆ జట్టు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. పంజాబ్ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, నెట్ రన్‌రేట్ బాగానే ఉంటే, ప్లేఆప్ అవకాశాలు ఉంటాయి.