Prithvi Shaw : వన్డే మ్యాచ్‌లో భారీ 'డబుల్ సెంచరీ' బాదిన పృథ్వీ షా
భారత జట్టు స్టార్ ఓపెనర్ పృథ్వీ షా.. తన బ్యాట్ తో ఇంగ్లండ్ లో పెను తుపాను సృష్టించాడు. పృథ్వీ షా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో వన్డే కప్ ఆడుతున్నాడు. ఇక్కడ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
భారత జట్టు స్టార్ ఓపెనర్ పృథ్వీ షా(Prithwi Shah).. తన బ్యాట్ తో ఇంగ్లండ్(England) లో పెను తుపాను సృష్టించాడు. పృథ్వీ షా ప్రస్తుతం ఇంగ్లండ్‌లో వన్డే కప్(Odi Cup) ఆడుతున్నాడు. ఇక్కడ వన్డేల్లో డబుల్ సెంచరీ(Double Century) చేసి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. దీంతో ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్(World Cup)కు నేను రేసులో ఉన్నాననే తన వాదనను వినిపించాడు. ఈ ఏడాది అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ప్రపంచ కప్ జరుగుతుంది.
పృథ్వీ షా ప్రస్తుతం వన్డే కప్‌లో నార్తాంప్టన్‌షైర్(Northamptonshire)జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడాడు. మూడో మ్యాచ్‌లో పృథ్వీ షా 129 బంతుల్లో 244 పరుగులతో మారథాన్ ఇన్నింగ్సు ఆడాడు. పృథ్వీ ఇన్నింగ్సులో 24 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. లిస్ట్-ఎ క్రికెట్‌లో పృథ్వీ షాకి ఇది రెండో డబుల్ సెంచరీ. 23 ఏళ్ల పృథ్వీ షా 81 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత గేర్ మార్చా. కేవలం 48 బంతుల్లో తదుపరి సెంచరీని కొట్టాడు.ఓపెనింగ్ రాగానే సోమర్సెట్(Somerset) బౌలర్లపై పృథ్వీ షా దారుణంగా విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్ తో పృథ్వీ షా ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. పృథ్వీ షా ఇన్నింగ్స్ కారణంగా సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ 8 వికెట్లకు 415 పరుగుల భారీ స్కోరు సాధించింది. బదులుగా సోమర్‌సెట్ జట్టు 45.1 ఓవర్లలో 328 పరుగులకే కుప్పకూలింది. నార్తాంప్టన్‌షైర్ 87 పరుగుల తేడా విజయం సాధించింది. ఈ ఇన్నింగ్స్ తో ఇంగ్లండ్‌లో వన్డే క్రికెట్‌లో సౌరవ్ గంగూలీ(Saurav Ganguly) అత్యధిక ఇన్నింగ్స్ 183 పరుగుల రికార్డు(Record)ను భారత యువ ఓపెనర్ పృథ్వీ షా బద్దలు కొట్టాడు.