17 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ రౌనక్ సాధ్వానీ ఇటలీలో జ‌రిగిన అండర్-20 ప్రపంచ జూనియర్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన రౌనక్ 11వ రౌండ్‌లో 8.5 పాయింట్లతో ట్రోఫీని గెలుచుకున్నాడు.

17 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ రౌనక్ సాధ్వానీ(Raunak Sadhwani) ఇటలీ(Italy)లో జ‌రిగిన అండర్-20 ప్రపంచ జూనియర్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌(World Junior Rapid Chess Championship 2023)గా నిలిచాడు. మహారాష్ట్ర(Maharashtra)లోని నాగ్‌పూర్‌(Nagpur)కు చెందిన రౌనక్ 11వ రౌండ్‌లో 8.5 పాయింట్లతో ట్రోఫీని గెలుచుకున్నాడు. విశేషమేమిటంటే.. టోర్నీలో ఆడేందుకు వీసా(Visa) పొందడంలో రౌనక్‌కు ఇబ్బందులు ఎదురైనా.. అతడి ఏకాగ్రతకు భంగం కలగలేదు.

ఈ ఘనత సాధించిన రౌనక్‌ సాధ్వానీకి ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అభినందనలు తెలిపారు. రౌనక్ తన వ్యూహాత్మక ప్రతిభ, నైపుణ్యంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారని, దేశం గర్వించేలా చేశారని అన్నారు. "FIDE వరల్డ్ జూనియర్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2023లో చారిత్రాత్మక విజయం సాధించినందుకు రౌనక్ సాధ్వానీకి అభినందనలు" అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో రాశారు. అతని వ్యూహాత్మక ప్ర‌తిభ‌, నైపుణ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. దేశం గర్వించేలా కూడా చేసింది. ఆయన తన అసాధారణ విజయాలతో మన దేశ యువతకు స్ఫూర్తినిస్తూనే ఉండుగాక. అతని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని విష్ చేశారు.

రౌనక్‌ 2వ, 5వ రౌండ్లలో అతడు చాలా తక్కువ ర్యాంక్ ఆటగాళ్లపై ఓడిపోయాడు. ఐదు రౌండ్ల వరకు మూడు పాయింట్లు మాత్రమే స్కోర్ చేయగలిగాడు. అయితే ఆఖరి రౌండ్‌లో జర్మనీకి చెందిన టోబియాస్ కొయెల్‌ను ఓడించి విజేతగా నిలిచాడు.

Updated On 14 Oct 2023 8:26 PM GMT
Yagnik

Yagnik

Next Story