ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఈ సీజ‌న్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఆరు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)ను ఓడించి ఈ సీజ‌న్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. చెన్నై(Chennai) ముందు ముంబై(Mumbai) 139 పరుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. బ‌దులుగా చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి విజయం సాధించింది. ఈమ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) మ‌రోసారి డ‌కౌట్ అయ్యాడు.

ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 139 పరుగులు చేయ‌గా.. చెన్నై 17.4 ఓవర్లలోనే ల‌క్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై తరఫున నెహాల్ వధెరా(Nehal Wadhera) 64 పరుగులు చేశాడు. అదే సమయంలో చెన్నై తరఫున డెవాన్ కాన్వే(Devon Conway) 44, రీతురాజ్(Ruthuraj) 30 పరుగులు చేశారు. చెన్నై ఆటగాడు మతిష పతిరనా బంతితో అద్భుతం చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్‌పాండే(Thushar Desh Pandey), దీపక్ చాహర్(Deepak Chahar) చెరో రెండు వికెట్లు తీశారు. ముంబై తరఫున పీయూష్ చావ్లా(Piyush Chawla) రెండు వికెట్లు తీశాడు. ట్రిస్టన్ స్టబ్స్, ఆకాష్ మధ్వల్ తలో వికెట్ తీశారు.

Updated On 6 May 2023 9:43 PM GMT
Yagnik

Yagnik

Next Story