పారాలింపిక్స్-2024లో నేడు నాలుగో రోజు. నేడు ప‌లు విభాగాల్లో భారత్‌ ఇప్పటికే ఒక్కో పతకం సాధించిన షూటర్ అవనీ లేఖరా, రన్నర్ ప్రీతి పాల్‌లు సెప్టెంబర్ 1 ఆదివారం మరోసారి బరిలోకి దిగనున్నారు

పారాలింపిక్స్-2024లో నేడు నాలుగో రోజు. నేడు ప‌లు విభాగాల్లో భారత్‌ ఇప్పటికే ఒక్కో పతకం సాధించిన షూటర్ అవనీ లేఖరా, రన్నర్ ప్రీతి పాల్‌లు సెప్టెంబర్ 1 ఆదివారం మరోసారి బరిలోకి దిగనున్నారు. వ్యక్తిగత రౌండ్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న అవని.. మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్ క్వాలిఫికేషన్‌లో సిద్ధార్థ్‌బాబుతో క‌లిసి సవాల్‌ విసర‌నుంది. మహిళల 100 మీటర్ల టీ35 ఈవెంట్‌లో రజత పతక విజేతగా నిలిచిన ప్రీతి.. మహిళల 200 మీటర్ల టీ35 ఈవెంట్‌లోనూ తన మంచి ప్రదర్శనను కొనసాగించాలని భావిస్తోంది.

పారాలింపిక్స్ డే 4 షెడ్యూల్

మధ్యాహ్నం 1 గం నుండి: పారా షూటింగ్

అవని ​​లేఖరా, సిద్ధార్థ్ బాబు (మిక్సడ్ 10మీ ఎయిర్ రైఫిల్ ప్రోన్ SH1 క్వాలిఫికేషన్‌లో)


మధ్యాహ్నం 1:39 నుండి: పారా అథ్లెటిక్స్

మహిళల 1500మీ - T11 రౌండ్ 1 - హీట్ 3లో రక్షిత రాజు

మధ్యాహ్నం 2 గంటల నుండి: పారా రోయింగ్

అనిత/నారాయణ కొంగనపల్లె (మిక్స్‌డ్ డబుల్ స్కల్స్ ఫైనల్‌లో PR3)

మధ్యాహ్నం 3 గంటల నుండి: పారా షూటింగ్

శ్రీహర్ష దేవరెడ్డి రామకృష్ణ (మిక్సడ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ ఎస్‌హెచ్ 2 క్వాలిఫికేషన్‌లో)

3:12 PM నుండి: పారా అథ్లెటిక్స్

పురుషుల షాట్‌పుట్‌లో రవి రొంగలి – F40 ఫైనల్

సాయంత్రం 4:30 నుండి: పారా షూటింగ్

అవని ​​లేఖరా, సిద్ధార్థ్ బాబు మిక్స్‌డ్ 10 మీ ఎయిర్ రైఫిల్ ప్రోన్ SH1 ఫైనల్ (అర్హత ఉంటే)

సాయంత్రం 6:30 నుండి: పారా షూటింగ్

శ్రీహర్ష్ దేవారెడ్డి రామకృష్ణ మిక్స్‌డ్ 10మీ ఎయిర్ రైఫిల్ ప్రోన్ SH2 ఫైనల్ (అర్హత సాధిస్తే)

7:17 pm నుండి: పారా ఆర్చరీ

పురుషుల ఇండివిజువల్ కాంపౌండ్ ఓపెన్ 1/8 ఎలిమినేషన్‌లో రాకేష్ కుమార్ vs కెన్ స్వాగుమిలాంగ్ (ఇండోనేషియా)

రాత్రి 8:10 నుండి: పారా బ్యాడ్మింటన్

నితేష్ కుమార్ vs డైసుకే ఫుజిహారా (జపాన్) పురుషుల సింగిల్స్ SL3 సెమీఫైనల్స్

రాత్రి 8:10 తర్వాత: పారా బ్యాడ్మింటన్

పురుషుల సింగిల్స్ SL4 సెమీఫైనల్స్‌లో సుహాస్ LY vs సుకాంత్ కదమ్

రాత్రి 8:10 తర్వాత: పారా బ్యాడ్మింటన్

తులసిమతి మురుగేషన్ - మహిళల సింగిల్స్ SU5 సెమీఫైనల్ మ్యాచ్ WSSU5314

9:15 pm నుండి: పారా టేబుల్ టెన్నిస్

భావినాబెన్ పటేల్ vs మార్తా వెర్డిన్ (మెక్సికో) మహిళల సింగిల్స్ - WS4 - రౌండ్ ఆఫ్ 16

10:40 pm నుండి: పారా అథ్లెటిక్స్

పురుషుల హైజంప్‌లో నిషాద్ కుమార్, రామ్ పాల్ - T47 ఫైనల్

11:27 pm నుండి: మహిళల 200 మీటర్లు

టీ35 ఫైనల్లో ప్రీతీ పాల్

మధ్యాహ్నం 12:15 నుండి: పారా టేబుల్ టెన్నిస్

మహిళల సింగిల్స్‌లో సోనాల్‌బెన్ పటేల్ vs అందెలా ముజినిక్ విన్‌సిక్ (క్రొయేషియా) - WS3 - రౌండ్ ఆఫ్ 16

Sreedhar Rao

Sreedhar Rao

Next Story