పారిస్ ఒలింపిక్స్(Paris Olympics) 2024 తొమ్మిదో రోజున‌ భారత్‌(India)కు మిశ్రమ ఫ‌లితాలు వ‌చ్చాయి. సెమీ ఫైనల్స్‌లో గ్రేట్ బ్రిటన్‌ను భారత హాకీ జట్టు ఓడించింది

పారిస్ ఒలింపిక్స్(Paris Olympics) 2024 తొమ్మిదో రోజున‌ భారత్‌(India)కు మిశ్రమ ఫ‌లితాలు వ‌చ్చాయి. సెమీ ఫైనల్స్‌లో గ్రేట్ బ్రిటన్‌ను భారత హాకీ జట్టు ఓడించింది. డెన్మార్క్‌తో జరిగిన బ్యాడ్మింట‌న్‌(Badminton) పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్య సేన్ ఓడిపోయాడు. పెనాల్టీ షూటౌట్‌లో బ్రిటన్‌(Britain)ను ఓడించి భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. నాలుగు క్వార్టర్లు ముగిసే సరికి ఇరు జట్ల స్కోరు 1-1తో సమమైంది. నిర్ణీత సమయం వరకు ఇరు జట్లూ ఆధిక్యం కోసం ప్రయత్నించినా సఫలం కాలేదు. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్‌లో భారత్‌ 4-2తో బ్రిటన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 10 మంది ఆటగాళ్లతో ఆడింది. ఎందుకంటే రెండో క్వార్టర్‌లో అమిత్ రోహిదాస్‌(Amit Rohit Das)కు అంపైర్‌(Umpaire) రెడ్ కార్డ్(Red Card) జారీ చేశాడు. దీని కారణంగా అతడు మొత్తం మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయినా పట్టు వదలని భారత జట్టు చివరి వరకు బ్రిటన్ కు గట్టిపోటీనిచ్చింది. ఈ విధంగా భారత జట్టు పతకం దిశగా మరో అడుగు ముందుకేసింది. సెమీఫైనల్‌లో విజయం సాధిస్తే భారత్ రజత పతకం ఖాయం. ఆగస్టు 6వ తేదీ మంగళవారం భారత్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్(Lakshya Sen) తన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో డెన్మార్క్‌(Denmark)కు చెందిన విక్టర్ అక్సెల్‌సెన్‌తో ఓడిపోయాడు. లక్ష్య మ్యాచ్‌ను అద్భుతంగా ప్రారంభించాడు, అయితే ఆక్సెల్‌సెన్ రెండు గేమ్‌లలో భారత ఆటగాడిపై ఆధిపత్యం చెలాయించాడు. అతడు లక్ష్యాను 22-20, 21-14తో ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్య విజయం సాధించి ఉంటే భారత్‌కు రజత పతకం దక్కేది. కానీ ఓడ‌డంతో లక్ష్య కాంస్య పతకం కోసం పోటీన‌డ‌నున్నాడు. కాంస్య పతకం కోసం మలేషియాకు చెందిన ఏడో సీడ్ జియా జీ లీతో లక్ష్య తలపడనున్నాడు. సోమవారం కాంస్యం కోసం ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోరు జరగనుంది.

టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్, పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైన‌ల్ దాట‌లేక‌పోయింది. మహిళల 75 కేజీల విభాగంలో చైనా నంబర్ వన్ లి కియాన్ మూడు రౌండ్లలో లోవ్లినాను ఓడించింది. కియెన్ 4-1తో లోవ్లినాను ఓడించింది.

ఆదివారం జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల డింగీ సెయిలింగ్‌లో ప్రిలిమినరీ సిరీస్‌లో 8వ రేసు తర్వాత మహిళల ఈవెంట్‌లో నేత్ర కుమనన్ 25వ స్థానంలో నిలవగా.. భారతదేశానికి చెందిన విష్ణు శరవణన్ 18వ స్థానంలో నిలిచారు. శనివారం జరిగిన రేస్ 6 తర్వాత 23వ ర్యాంక్‌లో ఉన్న శరవణన్ ఇప్పుడు 114 నెట్ పాయింట్లతో ఉన్నాడు. మహిళల డింగీ ఈవెంట్‌లో కుమనన్ 145 పాయింట్లతో 25వ స్థానంలో ఉంది. శనివారం జరిగిన రేస్ 6 తర్వాత ఆమె 24వ స్థానంలో నిలిచింది. ప్రారంభ సిరీస్‌లో మరో రెండు రేసులు మిగిలి ఉన్నాయి, సోమవారం 9, 10 రేసులు జరగనున్నాయి. ప్రిలిమినరీ సిరీస్‌లో టాప్ 10లో నిలిచిన సెయిలర్లు మంగళవారం పతకాల రేసులో ఉంటారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story