పారిస్ ఒలింపిక్స్‌లో ఐదో రోజు భారత్‌కు ఆశించిన ప‌లితాలు వ‌చ్చాయి.

పారిస్ ఒలింపిక్స్‌లో ఐదో రోజు భారత్‌కు ఆశించిన ప‌లితాలు వ‌చ్చాయి. బుధవారం పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో భారత షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం అతడు భారత్‌కు మూడో పతకాన్ని అందించాలని భావిస్తున్నాడు. అదే సమయంలో పూల్-బీ లో భారత పురుషుల హాకీ జట్టు బెల్జియంతో తలపడనుంది. బాక్సింగ్‌లో నిఖత్ జరీన్ మహిళల 50 కిలోల విభాగంలో ప్రిక్వార్టర్‌ఫైనల్‌లో త‌న పంచ్ ప‌వ‌ర్ చూపించ‌నుంది.

పారిస్ ఒలింపిక్స్‌లో గోల్ఫ్ పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పురుషుల వ్యక్తిగత స్త్రోల్ ప్లే రౌండ్-1లో గగన్‌జీత్ భుల్లర్, శుభంకర్ శర్మ భారత్ త‌రుపున బ‌రిలో ఉండ‌నున్నారు. కాగా ఆర్చరీలో పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రవీణ్ జాదవ్ చైనాకు చెందిన కావో వెన్చావోతో తలపడనున్నాడు. ఆరో రోజు నుండి అథ్లెటిక్స్ పోటీలు కూడా ప్రారంభం కానున్నాయి.

పారిస్ ఒలింపిక్స్ ఆరో రోజు భారత్ షెడ్యూల్..

- పురుషుల 20 కిమీ నడక: పరమ్‌జిత్ సింగ్ బిష్త్, ఆకాశ్‌దీప్ సింగ్, వికాస్ సింగ్ (ఉదయం 11.00 నుండి)

- మహిళల 20 కిమీ నడక: ప్రియాంక (మధ్యాహ్నం 12.50 నుంచి)

గోల్ఫ్

- పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్-1: గగన్‌జీత్ భుల్లర్, శుభంకర్ శర్మ (మధ్యాహ్నం 12.30 నుండి)

షూటింగ్

- పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌ ఫైనల్: స్వప్నిల్ కుసలే (మధ్యాహ్నం 1.00 గంటల నుంచి)

- మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ అర్హత: సిఫత్ కౌర్ సమ్రా, అంజుమ్ మౌద్గిల్ (మధ్యాహ్నం 3.30 గంటల నుంచి)

హాకీ

- భారత్ vs బెల్జియం గ్రూప్ స్టేజ్ మ్యాచ్: (1.30 PM IST)

బాక్సింగ్

- మహిళల 50 కిలోల ప్రిక్వార్టర్‌ఫైనల్: నిఖత్ జరీన్ vs యు వు (చైనా) (మధ్యాహ్నం 2.30 నుండి)

విలువిద్య

- పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్): ప్రవీణ్ జాదవ్ vs కావో వెంచావో (చైనా) (మధ్యాహ్నం 2.31 నుండి)

సెయిలింగ్‌

- పురుషుల డింగీ రేస్ వన్: విష్ణు శరవణన్ (సాయంత్రం 3.45 నుండి)

- పురుషుల డింగీ రేస్ 2: విష్ణు శరవణన్: రేస్ 1 తర్వాత

- మహిళల డింగీ రేస్ వన్: నేత్ర కుమనన్ (సాయంత్రం 7.05 నుండి)

- మహిళల డింగీ రేస్ టూ: నేత్ర కుమనన్: రేస్ 1 తర్వాత

బ్యాడ్మింటన్

- పురుషుల సింగిల్స్ R16 - లక్ష్య సేన్ vs ప్రణయ్(సాయంత్రం 5 గంట‌ల‌కు)

- మహిళల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16: పివి సింధు (రాత్రి 10 గంటల నుంచి)

Eha Tv

Eha Tv

Next Story