పారిస్ ఒలింపిక్స్‌లో మూడో రోజు కూడా భారత్‌కు కలిసిరాలేదు. అయితే షూటింగ్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన‌ మను భాకర్ త‌న జోడి సరబ్జోత్ సింగ్‌తో క‌లిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించ‌డం కాస్త ఊర‌టనిచ్చే అంశం.

పారిస్ ఒలింపిక్స్‌లో మూడో రోజు కూడా భారత్‌కు కలిసిరాలేదు. అయితే షూటింగ్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన‌ మను భాకర్ త‌న జోడి సరబ్జోత్ సింగ్‌తో క‌లిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించ‌డం కాస్త ఊర‌టనిచ్చే అంశం. నేడు నాల్గవ రోజు కాగా మరో పతకంపై భార‌త అభిమానులు భారీగా ఆశలు పెంచుకున్నారు. మంగళవారం పతకం సాధించే అవకాశం ఉంది. కాగా.. భార‌త ఆట‌గాళ్ల‌ షెడ్యూల్ చూద్దాం..

మంగళవారం హాకీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్‌లలో భారత ఆటగాళ్లు పోటీలో ఉండ‌నున్నారు. సోమవారం జరిగిన పూల్ బి మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు రియో ​​ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనాతో త‌ల‌ప‌డి 1-1తో డ్రాగా ముగించింది. భారత్ త‌న త‌దుప‌రి మ్యాచ్‌ మంగళవారం ఐర్లాండ్‌తో తలపడనుంది.

అదే సమయంలో బ్యాడ్మింటన్‌లో పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మరియు మహిళల డబుల్స్ తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప వారి వారి గ్రూప్ మ్యాచ్‌లలో పోటీపడనున్నారు. అలాగే ముగ్గురు భారతీయ క్రీడాకారులు బాక్సింగ్‌లో త‌మ పంచ్ ప‌వర్ చూపించ‌నున్నారు. ఇందులో ఒక పురుష, ఇద్దరు మహిళా బాక్సర్లు ఉన్నారు.

పారిస్ ఒలింపిక్స్ నాలుగో రోజు భారత్ షెడ్యూల్ ఇలా...

షూటింగ్

ట్రాప్ పురుషుల అర్హత (2వ రోజు): పృథ్వీరాజ్ తొండైమాన్ (మధ్యాహ్నం 12:30 నుండి)

- ట్రాప్ మహిళల అర్హత (రోజు 1): శ్రేయసి సింగ్, రాజేశ్వరి కుమారి (మధ్యాహ్నం 12:30 నుండి)

- 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్: భారత్ vs కొరియా - మను భాకర్/సరబ్జోత్ సింగ్ మరియు వోన్హో లీ/జిన్ యే ఓహ్: (మధ్యాహ్నం 1 గంటల నుంచి)

హాకీ

- భారతదేశం vs ఐర్లాండ్ పూల్ B మ్యాచ్: (4:45 PM IST)

విలువిద్య

- మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: అంకితా భకత్ vs వియోల్టా మీస్జో (పోలాండ్) - (సాయంత్రం 5:15 నుండి)

- మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: భజన్ కౌర్ vs సిఫా నురాఫిఫా కమల్ (ఇండోనేషియా) - (5:30 PM IST)

- పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: ధీరజ్ బొమ్మదేవర vs ఆడమ్ లీ (చెక్ రిపబ్లిక్) - (10:45 PM IST)

బ్యాడ్మింటన్

- పురుషుల డబుల్స్: సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి/చిరాగ్ శెట్టి vs అల్ఫియాన్/అరిడియాంటో (ఇండోనేషియా) - (సాయంత్రం 5:30 నుండి)

- మహిళల డబుల్స్: తానీషా/పొన్నప్ప vs మపాసా/యు (ఆస్ట్రేలియా) - (సాయంత్రం 6:20 నుండి)

బాక్సింగ్

- పురుషుల 51 కేజీల రౌండ్ ఆఫ్ 16: అమిత్ పంఘల్ vs పాట్రిక్ చినియెంబా (జాంబియా) (సాయంత్రం 7:16 నుండి)

- మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 32: జాస్మిన్ లంబోరియా vs నెస్టి పెటెసియో (ఫిలిప్పీన్స్) (రాత్రి 9:25 నుండి)

- మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16: ప్రీతి పవార్ vs యెని మార్సెలా అరియాస్ (కొలంబియా) (మధ్యాహ్నం 1:20 నుండి)

Updated On 30 July 2024 3:47 AM GMT
Eha Tv

Eha Tv

Next Story