పారిస్ ఒలింపిక్ క్రీడల్లో రెండో రోజైన ఆదివారం మహిళా షూటర్ మను భాకర్ భారత్ పతకాల ఖాతాను తెరిచింది.

పారిస్ ఒలింపిక్ క్రీడల్లో రెండో రోజైన ఆదివారం మహిళా షూటర్ మను భాకర్ భారత్ పతకాల ఖాతాను తెరిచింది. మూడో రోజైన సోమవారం రమితా జిందాల్, అర్జున్ బాబౌటాల ద్వారా కూడా పతక ఆశలు చిగురించేలా చేశారు. గ్రూప్ దశలోని రెండో మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు అర్జెంటీనాతో తలపడనుండగా.., బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు కూడా బ‌రిలో దిగ‌నున్నారు. మహిళల ఆర్చరీ జట్టు ప్రయాణం క్వార్టర్ ఫైనల్‌లో ముగియ‌గా.. పురుషుల ఆర్చరీ జట్టు నుండి మెరుగైన ప్రదర్శన వెలువ‌డ‌వ‌చ్చ‌ని అంతా భావిస్తున్నారు.

పారిస్ ఒలింపిక్స్ మూడో రోజైన సోమవారం భారత్ షెడ్యూల్ ఇలా...

బ్యాడ్మింటన్

- పురుషుల డబుల్స్ (గ్రూప్ స్టేజ్): సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి vs మార్క్ లామ్స్‌ఫస్ మరియు మార్విన్ సీడెల్ (మధ్యాహ్నం 12)

- మహిళల డబుల్స్ (గ్రూప్ దశ): అశ్విని పొన్నప్ప మరియు తనీషా క్రాస్టో vs నమీ మత్సుయామా మరియు చిహారు షిదా (మధ్యాహ్నం 12:50 నుండి)

- పురుషుల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్): లక్ష్య సేన్ vs జూలియన్ క్యారేజీ (సాయంత్రం 5:30 నుండి)

షూటింగ్

- 10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ అర్హత: మను భాకర్ మరియు సరబ్జోత్ సింగ్, రిథమ్ సాంగ్వాన్ మరియు అర్జున్ సింగ్ చీమా (మధ్యాహ్నం 12:45 నుండి)

- పురుషుల ట్రాప్ అర్హత: పృథ్వీరాజ్ తొండైమాన్ (మధ్యాహ్నం 1:00 గంటల నుంచి)

- 10మీ ఎయిర్ రైఫిల్ మహిళల ఫైనల్: రమితా జిందాల్ (మధ్యాహ్నం 1:00 గంటల నుంచి)

- 10మీ ఎయిర్ రైఫిల్ పురుషుల ఫైనల్: అర్జున్ బబౌటా (మధ్యాహ్నం 3:30 గంటల నుంచి)

హాకీ

- పురుషుల పూల్ B మ్యాచ్: భారత్ vs అర్జెంటీనా (4:15 PM IST)

విలువిద్య

- పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్స్: తరుణ్‌దీప్ రాయ్, ధీరజ్ బొమ్మదేవర, ప్రవీణ్ జాదవ్ (సాయంత్రం 6:30 నుండి)

టేబుల్ టెన్నిస్

- మహిళల సింగిల్స్ (రౌండ్ ఆఫ్ 32): శ్రీజ అకుల vs జియాన్ జెంగ్ (రాత్రి 11:30 నుండి)

Eha Tv

Eha Tv

Next Story