పారిస్ ఒలింపిక్ క్రీడల 12వ రోజైన బుధవారం వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను పతకం సాధించాలని భారత్ ఆశిస్తోంది.

పారిస్ ఒలింపిక్ క్రీడల 12వ రోజైన బుధవారం వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను పతకం సాధించాలని భారత్ ఆశిస్తోంది. పురుషుల 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అథ్లెట్ అవినాష్ సేబుల్ కూడా ఫైనల్‌లో పాల్గొన‌నున్నాడు. అదే సమయంలో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ 50 కిలోల విభాగంలో ఫైనల్స్‌కు చేరుకుంది. ఆమె బంగారు పతకం గెలుస్తుందని భావిస్తున్నారు. మహిళా గోల్ఫర్లు అదితి అశోక్, దీక్షా దాగర్ కూడా నేడు త‌మ‌ ఒలింపిక్ ప్రారంభ మ్యాచ్‌ల‌ను ఆడ‌నున్నారు. మహిళల టేబుల్ టెన్నిస్ క్వార్టర్ ఫైనల్‌లో భార‌త్‌ జర్మనీతో తలపడనుంది.

మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. మరోసారి ఆమె ఆ ఫీట్‌ను పునరావృతం చేస్తుందని అంతా భావిస్తున్నారు. మీరాబాయి పతకం సాధిస్తే.. ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన భారత క్రీడాకారుల లిస్టులో చేరుతుంది. ఇప్పటి వరకూ సుశీల్ కుమార్, పీవీ సింధు, మను భాకర్ మాత్రమే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత ఆటగాళ్లు.

క్వాలిఫికేషన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన భారత అథ్లెట్ అవినాష్ సాబ్లే కూడా మెరుగ్గా రాణిస్తాడని అంచనాలు ఉన్నాయి. ఫైనల్స్‌కు అర్హత సాధించడం ద్వారా భారత్‌కు మరో పతకంపై సేబుల్ ఆశలు రేకెత్తించాడు. మరోవైపు మనిక బాత్రా, అర్చన కామత్, శ్రీజ ఆకులలతో కూడిన మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు సెమీఫైనల్‌లోకి ప్రవేశించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మణిక సారథ్యంలోని జట్టు విజయంలో సఫలమైతే పతకం ఖాయం అయిన‌ట్లే.

పారిస్ ఒలింపిక్ క్రీడల 12వ రోజు భారత్ షెడ్యూల్ ఇలా..

అథ్లెటిక్స్‌..

- మారథాన్ నడక రిలే(మిక్స్‌డ్‌): సూరజ్ పన్వర్, ప్రియాంక (ఉదయం 11 గంటల నుండి)

- పురుషుల హైజంప్ అర్హత: సర్వేష్ కుషారే (మధ్యాహ్నం 1.35 నుంచి)

- మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రౌండ్-1: జ్యోతి యారాజీ (మధ్యాహ్నం 1.45 నుంచి)

- పురుషుల ట్రిపుల్ జంప్ అర్హత: అబ్దుల్లా, ప్రవీణ్ చిత్రవాలె (రాత్రి 10.45 నుండి)

- పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్: అవినాష్ సాబుల్ (మధ్యాహ్నం 1.13 నుంచి)

- మహిళల జావెలిన్ త్రో అర్హత: అన్ను రాణి (మధ్యాహ్నం 1.55 నుంచి)

గోల్ఫ్

- మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్-1: అదితి అశోక్, దీక్షా దాగర్ (మధ్యాహ్నం 12.30 నుండి)

టేబుల్ టెన్నిస్

- మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్స్: భారత్ vs జర్మనీ (మధ్యాహ్నం 1.30 గంటల నుంచి)

రెజ్లింగ్

- మహిళల ఫ్రీస్టైల్ 53 కేజీ: అంతిమ్ పంఘల్ vs జైనెప్ యెట్‌గిల్ (టర్కీ) (మధ్యాహ్నం 2.30 నుండి)

- మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల ఫైనల్: వినేష్ ఫోగట్ vs సారా ఆన్ హిల్డెబ్రాండ్ (అమెరికా) (రాత్రి 9.45 నుండి)

వెయిట్ లిప్టింగ్‌

- మహిళలు 49 కేజీలు: మీరాబాయి చాను (రాత్రి 11 గంటల నుంచి)

Sreedhar Rao

Sreedhar Rao

Next Story