భారత్ తరఫున స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్(Lakshya Sen) పారిస్ ఒలింపిక్స్ 10వ రోజైన(Paris Olympics Day 10) సోమవారం కాంస్య పతక పోరులో ఆడ‌నున్నాడు.

భారత్ తరఫున స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్(Lakshya Sen) పారిస్ ఒలింపిక్స్ 10వ రోజైన(Paris Olympics Day 10) సోమవారం కాంస్య పతక పోరులో ఆడ‌ను్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్‌లో డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్‌సెన్‌పై లక్ష్య ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. అయితే అతడు ఇప్పటికీ దేశానికి కాంస్య పతకాన్ని అందివ్వ‌గ‌ల‌డు. ఇప్పటివరకు అథ్లెటిక్స్‌లో భారత్ నిరాశపరిచింది. సోమవారం మహిళల 400 మీటర్లలో కిరణ్ పహల్(Kiran Pahal), పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాష్ సేబుల్(Avinash Sebul) ల నుంచి మెరుగైన ప్రదర్శనను ఆశిస్తున్నారు.

పారిస్ ఒలింపిక్స్ 10వ రోజు భారత్ షెడ్యూల్ ఇలా..

షూటింగ్

- స్కీట్ మిక్స్‌డ్ టీమ్ (అర్హత): మహేశ్వరి చౌహాన్, అనంత్‌జిత్ సింగ్ నరుకా (మధ్యాహ్నం 12.30 నుండి)

టేబుల్ టెన్నిస్

- మహిళల టీమ్ ప్రీ-క్వార్టర్ ఫైనల్: భారత్(India) vs రొమేనియా(Romenia) (మధ్యాహ్నం 1.30 నుండి)

వ్యాయామ క్రీడలు

- మహిళల 400మీ (మొదటి రౌండ్): కిరణ్ పహల్ (హీట్ ఫైవ్) (మధ్యాహ్నం 3.25 నుంచి)

- పురుషుల 3000మీ స్టీపుల్‌చేజ్ (రౌండ్ 1): అవినాష్ సాబుల్ (హీట్ 2) (రాత్రి 10.35 నుండి)

సెయిలింగ్‌

- మహిళల డింగీ రేస్ 9: నేత్ర కుమనన్(Netra Kumanan) (సాయంత్రం 3.45 నుండి)

- పురుషుల డింగీ రేస్ 9: విష్ణు శరవణన్(Vishnu Sharavanan) (సాయంత్రం 6.10 నుండి)

బ్యాడ్మింటన్

- పురుషుల సింగిల్స్ కాంస్య పతక మ్యాచ్: లక్ష్య సేన్ vs లీ జీ జియా (మలేషియా) (సాయంత్రం 6.00 గంటల నుండి)

రెజ్లింగ్

- మహిళల ఫ్రీస్టైల్ 68 కేజీలు - రౌండ్ ఆఫ్ 16 - నిషా(Nisha) (సాయంత్రం 6:30)

- మహిళల ఫ్రీస్టైల్ 68 కేజీలు - క్వార్టర్ ఫైనల్ - నిషా (రాత్రి 7:50 గంటలకు) (అర్హత సాధిస్తే)

-మహిళల ఫ్రీస్టైల్ 68 కేజీ-సెమీఫైనల్స్-నిషా (1:10 pm) (అర్హత సాధించిన తర్వాత)

Sreedhar Rao

Sreedhar Rao

Next Story