MI vs RR IPL 2024 : ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన రాయల్స్
ఐపీఎల్ 2024 14వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

Parag fifty helps RR win by 6 wickets in 126-run chase
ఐపీఎల్ 2024 14వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసి రాజస్థాన్‌కు 126 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం సంజూ జట్టు ఆరు వికెట్లు మిగిలి ఉండగానే సాధించింది.
రాజస్థాన్ బౌలర్ ట్రెంట్ బౌల్డ్ మొదటి ఓవర్ నుండే విధ్వంసం సృష్టించాడు. రెండు వరుస బంతుల్లో రోహిత్, నమన్ ధీర్‌లను అవుట్ చేశాడు. దీని తర్వాత మూడో ఓవర్‌లో ఖాతా తెరవనీయకుండానే ట్రిస్టన్ స్టబ్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ముంబై 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాప్-4లో ముగ్గురు ఆటగాళ్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇది ఆరోసారి.
మరో బౌలర్ యుజ్వేంద్ర చాహల్ కూడా ముంబై బ్యాట్స్‌మెన్‌పై పైచేయి సాధించాడు . చాహల్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్టులోని ముగ్గురు బలమైన బ్యాట్స్‌మెన్‌లను ట్రాప్ చేశాడు. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై బ్యాట్స్‌మెన్ చాహల్ విధ్వంసక బౌలింగ్ ముందు సొంతగడ్డపై లొంగిపోయారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అనంతరం చేధనకు దిగిన రాజస్థాన్ జట్టుకు కూడా మంచి శుభారంభం దక్కలేదు. యశస్వి జైశ్వాల్(10), బట్లర్(13), శాంసన్(12) విఫలమవ్వగా.. రియాన్ పరాగ్(54) అశ్విన్(16) సాయంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా.. ముంబై ఇండియన్స్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి చివరి స్థానంలో ఉంది.
