పాకిస్థాన్ లో అర్షద్ నదీమ్ పేరు మార్మోగిపోతుంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ ఫైనల్‌లో ఒలింపిక్ రికార్డును రెండుసార్లు బద్దలు కొట్టడం ద్వారా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు

పాకిస్థాన్ లో అర్షద్ నదీమ్ పేరు మార్మోగిపోతుంది. పారిస్ ఒలింపిక్స్ 2024లో జావెలిన్ ఫైనల్‌లో ఒలింపిక్ రికార్డును రెండుసార్లు బద్దలు కొట్టడం ద్వారా బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. నదీమ్ 92.97 మీటర్ల జావెలిన్ విసిరి సరికొత్త ఒలింపిక్ రికార్డు సృష్టించాడు. దీంతో 32 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు తొలి ఒలింపిక్ పతకం వ‌చ్చింది.

చారిత్రాత్మక విజయం తర్వాత నదీమ్‌కు చాలా అవార్డులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. నివేదికల ప్రకారం.. పాకిస్తాన్‌లోని మంత్రులు, ప్రముఖులు ఇప్పటికే అనేక నగదు రివార్డులను ప్రకటించారు. నదీమ్ ఇప్పటివరకు అందుకున్న అవార్డుల జాబితాను ఒకసారి చూద్దాం.

నదీమ్ 153 మిలియన్ పాకిస్తానీ రూపాయలు (రూ. 50 కోట్లకు పైగా.. 4.5 కోట్ల భారతీయ రూపాయలు) అందుకోబోతున్నారు. పాకిస్థాన్‌కు చెందిన వార్తా సంస్థ డాన్ ప్రకారం.. ఈ మొత్తంలో పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియం నవాజ్.. నదీమ్‌కు రూ.10 లక్షల రివార్డును ప్రకటించారు. పంజాబ్ గవర్నర్ సర్దార్ సలీం హైదర్ ఖాన్ PKR 2 మిలియన్ల అదనపు బహుమతిని ప్రకటించారు.

కరాచీ మేయర్ ముర్తాజా వాహబ్‌తో సహా సింధ్ ముఖ్యమంత్రి నదీమ్‌కు పాకిస్తానీ రూ. 50 మిలియన్లను అందజేయ‌నున్నారు. సింధ్ గవర్నర్ కమ్రాన్ టెసోరి పాకిస్థానీ రూ. 1 మిలియన్‌ను అదనంగా ప్రకటించారు. ప్రముఖ పాకిస్థానీ గాయకుడు అలీ జాఫర్ నదీమ్‌కు పాకిస్థానీ 1 మిలియన్ విరాళంగా ఇస్తున్నట్లు ధృవీకరించారు, క్రికెటర్ అహ్మద్ షెహజాద్ కూడా తన ఫౌండేషన్ ద్వారా 1 మిలియన్ ప్రకటించారు.

అంతేకాదు.. జాతీయ అసెంబ్లీ దిగువ సభ సెషన్‌లో నదీమ్‌ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. సెనేట్ డిప్యూటీ చైర్మన్ సయ్యదల్ ఖాన్ నాసర్ పాకిస్థాన్‌కు వచ్చిన తర్వాత అర్షద్‌కు విందును ఏర్పాటు చేస్తారు.

సింధ్ ప్రభుత్వ ప్రతినిధి, సుక్కూర్ మేయర్ బారిస్టర్ ఇస్లాం షేక్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ చేరుకున్న తర్వాత నదీమ్‌కు బంగారు కిరీటం ప్రదానం చేయనున్నట్లు జియో న్యూస్ నివేదించింది. అలాగే సుక్కూర్‌లో కొత్త స్పోర్ట్స్ స్టేడియానికి నదీమ్ పేరు పెట్టనున్నట్లు తెలిపారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story