ఎట్టకేలకు పాకిస్థాన్ జట్టు వన్డే ప్రపంచకప్ (వరల్డ్ కప్ 2023)లో పాల్గొనేందుకు భారత్‌కు వీసా లభించింది. దీంతో టోర్నమెంట్ కోసం బాబర్ ఆజం నేతృత్వంలోని జట్టు ఇప్పుడు భారత్‌కు రావ‌డానికి ఎటువంటి అడ్డంకులు లేవు.

ఎట్టకేలకు పాకిస్థాన్(Pakistan) జట్టు వన్డే ప్రపంచకప్ (World Cup- 2023)లో పాల్గొనేందుకు భారత్‌(India)కు వీసా(Visa) లభించింది. దీంతో టోర్నమెంట్ కోసం బాబర్ ఆజం(Babar Azam) నేతృత్వంలోని జట్టు ఇప్పుడు భారత్‌కు రావ‌డానికి ఎటువంటి అడ్డంకులు లేవు. పాకిస్థాన్ జట్టుకు వీసా లభించినట్లు ఐసీసీ(ICC) ధృవీకరించింది. సెప్టెంబరు 27న పాకిస్థాన్ భారత గడ్డకు చేరుకుంటుంది.

ఐసిసి ప్రకారం.. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు వీసాల మంజూరుకు భారత ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఆమోదం తెలిపింది. అంతకుముందు.. వీసా సమస్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఐసిసితో తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. వీసాలు పొందడంలో జాప్యం జట్టు సన్నాహాలను ప్రభావితం చేస్తోందని పేర్కొంది.

పాక్ తొలుత‌ హైదరాబాద్‌(Hyderabad)లో జరిగే రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది. తర్వాత ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో పాక్‌ తన తొలి ప్రాక్టీస్ మ్యాచ్(Practice Match) ఆడాల్సి ఉంది. పీసీబీ, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జియోఫ్ అల్లార్డైస్‌కు రాసిన లేఖలో.. భారత్‌లో జరిగే ప్రపంచకప్ కోసం త‌మ‌ ఆటగాళ్లు, జట్టు అధికారులు, అభిమానులు, జర్నలిస్టులకు వీసాలకై తాత్స‌రం చేస్తున్న‌ట్లు పేర్కొంది. ఇలా అసమానంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. అయితే వీసా ప్రక్రియలో సాధారణ పరిపాలనా విధానాన్ని అనుసరించినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి.

పాక్ జ‌ట్టు :

బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, హసన్ అలీ, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అగా, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, సౌద్ షకీల్, హరీస్ రౌఫ్ , మహ్మద్ వాసిం జూనియర్

Updated On 25 Sep 2023 10:43 AM GMT
Yagnik

Yagnik

Next Story