pakistani cricketer abdullah shafiq : అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్న పాక్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్.!
పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్లా షఫీక్ (abdullah shafiq ) ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.. ఘనమైన రికార్డు కాదు, పరమ చెత్త రికార్డు ఇది. వరుసగా నాలుగు టీ-20 (T20 Match) మ్యాచ్‌ల్లో సున్నాకే అవుటయ్యిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఆదివారం అఫ్గనిస్తాన్‌తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో గోల్డెన్ డౌకౌట్ అయ్యాడు షఫీక్.
పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్లా షఫీక్ (abdullah shafiq ) ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.. ఘనమైన రికార్డు కాదు, పరమ చెత్త రికార్డు ఇది. వరుసగా నాలుగు టీ-20 (T20 Match) మ్యాచ్‌ల్లో సున్నాకే అవుటయ్యిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఆదివారం అఫ్గనిస్తాన్‌తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో గోల్డెన్ డౌకౌట్ అయ్యాడు షఫీక్. అంతకుముందు అఫ్గనిస్తాన్‌తో జరిగిన మొదటి టీ-20 మ్యాచ్‌లోనూ షఫీక్ పరుగుల ఖాతా తెరవకముందే ఇంటిదారి పట్టాడు. అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టీ-20 మ్యాచుల్లోనూ షఫీక్ సున్నాకే అవుటయ్యాడు. మొత్తంగా ఇలా వరుసగా నాలుగు టీ-20 మ్యాచుల్లో డకౌట్ అవ్వడమనే చెత్త రికార్డును షఫీక్ మూటగట్టుకున్నాడు. ఇంటర్నేషనల్ కెరీర్‌లో ఇప్పటి వరకు అయిదు టీ-20 మ్యాచ్‌లు ఆడాడు షఫీక్. ఇందులో నాలుగు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. ఈ నాలుగు మ్యాచులలో షఫీక్ కేవలం ఏడు బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇలాంటి రికార్డును నమోదు చేశాడు. వరుసగా మూడు వన్డే మ్యాచులలో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ బాట పట్టిన సంగతి క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. ఇక పాకిస్తాన్‌తో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లోనూ అఫ్గనిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను గెల్చుకుంది. పాకిస్తాన్‌పై టీ-20 సిరీస్‌లో విజయం సాధించడం అఫ్గనిస్తాన్‌కు ఇదే మొదటిసారి.