ప్రపంచకప్-2023లో వరుస ఓటములతో స‌త‌మ‌త‌మ‌వుతున్న పాకిస్థాన్ జ‌ట్టు ఎట్ట‌కేల‌కు విజయాన్ని ద‌క్కించుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ప్రపంచకప్-2023లో వరుస ఓటములతో స‌త‌మ‌త‌మ‌వుతున్న పాకిస్థాన్(Pakistan) జ‌ట్టు ఎట్ట‌కేల‌కు విజయాన్ని ద‌క్కించుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓట‌మితో బంగ్లాదేశ్ జట్టుకు సెమీ ఫైన‌ల్(Semi Final) అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి. బంగ్లాదేశ్ జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కానీ సెమీ-ఫైనల్‌కు చేరుకునే అవకాశం లేదు. మరోవైపు ఈ విజయంతో పాకిస్థాన్ సెమీ ఫైన‌ల్ ఆశ‌ల‌ను స‌జీవంగా నిలుపుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 204 పరుగులకే పరిమితమైంది. అనంత‌రం 205 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ 33వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. పాకిస్థాన్ తరఫున షాహీన్ ఆఫ్రిది(Shaheen Afridi) అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ వసీమ్ జూనియర్(Mohammad Wasim Junior) కూడా తన వంతుగా మూడు వికెట్లు పడగొట్టాడు. హరీస్ రవూఫ్(Haris Rauf) కూడా రెండు వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ జ‌ట్టులో మహ్మదుల్లా 56 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్థాన్ జ‌ట్టులో అబ్దుల్లా షఫీక్ 68 పరుగులు, ఫఖర్ జమాన్ 81 పరుగులు చేసి జట్టుకు 128 పరుగుల శుభారంభాన్ని అందించారు. దీంతో ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ సులువుగా గెలిచింది.

Updated On 31 Oct 2023 7:18 PM GMT
Yagnik

Yagnik

Next Story