న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కి పాకిస్థాన్ జట్టులో పేసర్ మహ్మద్ అమీర్, ఆల్ రౌండర్ ఇమాద్ వాసిమ్‌

న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కి పాకిస్థాన్ జట్టులో పేసర్ మహ్మద్ అమీర్, ఆల్ రౌండర్ ఇమాద్ వాసిమ్‌లు చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ ఇటీవల అంతర్జాతీయ రిటైర్మెంట్ నుండి బయటకు వచ్చారు. జూన్‌లో T20 ప్రపంచ కప్‌ జరగనున్న నేపథ్యంలో వీరి ప్రదర్శన ఆధారంగా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బాబర్ ఆజం నేతృత్వంలోని జట్టులో ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఉస్మాన్ ఖాన్‌ అనే ఇద్దరు కొత్త బ్యాటర్లు కూడా ఉన్నారు. ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నారు.

న్యూజిలాండ్ టీ20లకు పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వాసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ అమీర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సయీమ్ అయీమ్ , షాహీన్ షా అఫ్రిది, ఉసామా మీర్, ఉస్మాన్ ఖాన్, జమాన్ ఖాన్

నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: హసీబుల్లా, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్ మరియు సల్మాన్ అలీ అఘా

Updated On 9 April 2024 9:39 PM GMT
Yagnik

Yagnik

Next Story