ఐపీఎల్ 2024 14వ మ్యాచ్‌లో సోమవారం ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్ రాయల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.

ఐపీఎల్ 2024 14వ మ్యాచ్‌లో సోమవారం ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్ రాయల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ మ్యాచ్‌లో బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించినా.. యువ బ్యాట్స్‌మెన్ ర్యాన్ పరాగ్ అర్ధ సెంచరీతో తన సత్తా చాటాడు.

ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ మినహా మరే బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీ నమోదు చేయకపోవడం గమనార్హం. రియాన్ పరాగ్ 39 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 54 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. రియాన్ ప‌రాగ్‌కి ఈ ఇన్నింగ్స్ ప్రత్యేకమైనది ఎందుకంటే అతడు విరాట్ కోహ్లి నుంచి ఆరెంజ్ క్యాప్‌ను లాగేసుకున్నాడు. అవును.. రియాన్ పరాగ్ ఇప్పుడు IPL 2024లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

రియాన్ పరాగ్ 3 మ్యాచ్‌లలో రెండు అర్ధ సెంచరీల సహాయంతో 181 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల‌లో అతడు అగ్ర స్థానానికి చేరుకున్నాడు. రెండు అర్ధ సెంచరీల సాయంతో 3 మ్యాచ్‌ల్లో 181 పరుగులు చేసి విరాట్ కోహ్లీని పరాగ్ రెండో స్థానానికి నెట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 3 మ్యాచ్‌ల్లో 167 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 3 మ్యాచ్‌ల్లో 137 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 3 మ్యాచ్‌ల్లో 130 పరుగులు చేసి టాప్-5 లో ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో రియాన్ పరాగ్ అంతకుముందు ఐదో స్థానంలో ఉండ‌గా.. తాజా అర్ధ సెంచరీ తర్వాత నేరుగా అగ్ర స్థానానికి ఎగబాకాడు.

Updated On 1 April 2024 10:33 PM GMT
Yagnik

Yagnik

Next Story