వన్డే ప్రపంచకప్‍‍‍-2023లో భాగంగా జ‌రిగిన‌ 30వ మ్యాచ్‌లో శ్రీలంకపై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 241 పరుగులు చేయగా..

వన్డే ప్రపంచకప్‍‍‍-2023లో భాగంగా జ‌రిగిన‌ 30వ మ్యాచ్‌లో శ్రీలంక(Sri Lanka)పై ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) విజయం సాధించింది. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 241 పరుగులు చేయగా.. బ‌దులుగా అఫ్గానిస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఈ ఓటమితో శ్రీలంక టోర్నీలో ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. కాగా టోర్నీలో ఇంగ్లండ్(England), పాకిస్తాన్(Pakistan) ల‌పై గెలిచిన ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంకను కూడా ఓడించింది.

శ్రీలంకపై ఆఫ్ఘనిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌(World Cup)లో ఆఫ్ఘనిస్థాన్‌కు ఇది మూడో విజయం. గతంలో ఈ జట్టు ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌లను ఓడించి సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. అదే సమయంలో శ్రీలంకకు సెమీఫైనల్ మార్గాన్ని కష్టతరంగా మార్చింది.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులు చేసింది. అనంతరం అఫ్గానిస్థాన్‌ 45.2 ఓవర్లలో ల‌క్ష్యాన్ని ఛేదించింది. శ్రీలంక తరఫున పాతుమ్ నిస్సాంక(46), కుసాల్ మెండిస్(39), సదీర సమరవిక్రమ(36) పరుగులు చేయ‌గా.. చివర్లో తిక్షణ (29) పరుగులతో మెరిశాడు. అఫ్గానిస్థాన్ జ‌ట్టులో ఫరూకీ నాలుగు వికెట్లు, ముజీబ్ ఉర్ రెహమాన్ రెండు వికెట్లు, అజ్మతుల్లా, రషీద్ ఖాన్ చెరో వికెట్ చొప్పున‌ తీశారు.

242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ తొలి ఓవర్‌లోనే గుర్బాజ్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఇబ్రహీం జద్రాన్ (39).. రహ్మత్ షా (62)తో కలిసి మ్యాచ్‌పై ప‌ట్టు సాధించారు. వీరిద్దరూ ఔటైన తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ 73 నాటౌట్, కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ 58 నాటౌట్‌తో నాలుగో వికెట్‌కు అజేయ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి తమ జట్టుకు విజయాన్ని అందించారు.

Updated On 30 Oct 2023 10:03 PM GMT
Yagnik

Yagnik

Next Story