శ్రీలంకను ఓడించడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ మిస్టరీని మరికొంత ఛేదించింది. ఇంతకుముందు సెమీ-ఫైనల్ రేసులో 6 జట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు మరో జట్టు సెమీ-ఫైనల్ రేసు నుండి దాదాపుగా నిష్క్రమించింది.

శ్రీలంక(Srilanka)ను ఓడించడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) సెమీస్(Semi Final) మిస్టరీని మరికొంత ఛేదించింది. ఇంతకుముందు సెమీ-ఫైనల్ రేసులో 6 జట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు మరో జట్టు సెమీ-ఫైనల్ రేసు నుండి దాదాపుగా నిష్క్రమించింది. శ్రీలంక 6 మ్యాచ్‌లు ఆడి 2 మాత్రమే గెలవగలిగింది. నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్.. శ్రీలంకను ఓడించడంతో సెమీ-ఫైనల్ రేసు నుంచి ఆ జ‌ట్టు దాదాపు నిష్క్ర‌మించాయి.

ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. నిన్న శ్రీలంక‌పై గెల‌వ‌డం ద్వారా ఆఫ్ఘనిస్థాన్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలను స‌జీవంగా నిలుపుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ఆడిన‌ 6 మ్యాచ్‌ల్లో 3 గెలిచింది. మూడో విజయంతో ప్రస్తుతం సెమీఫైనల్ రేసులో ఉన్న ఐదో జట్టుగా అవతరించింది. శ్రీలంక సెమీస్ అవ‌కాశాలు దాదాపు స‌న్న‌గిల్లాయి.

సెమీ-ఫైనల్ రేసు నుంచి దాదాపు 5 జట్లు నిష్క్ర‌మించాయి. వీటిలో శ్రీలంక, ఇంగ్లాండ్(England), పాకిస్తాన్(Pakisthan), నెదర్లాండ్స్(Nedarlands), బంగ్లాదేశ్(Bangladesh) ఉన్నాయి. మరోవైపు 5 జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకునే ఆశలు స‌జీవంగా నిలుపుకున్నాయి. వాటిలో భారత్(India), న్యూజిలాండ్(Newzealand), ఆస్ట్రేలియా(Australia), దక్షిణాఫ్రికా(South Africa), ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ప్రపంచకప్ చరిత్రలో అఫ్గానిస్థాన్ తొలిసారి సెమీఫైనల్‌లోకి అడుగుపెడుతుందా లేదా అనేది చూడాలి.

Updated On 30 Oct 2023 10:48 PM GMT
Yagnik

Yagnik

Next Story