గురువారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకను 5 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా న్యూజిలాండ్ వారి 4-మ్యాచ్‌ల పరాజయాల పరంపరను బ్రేక్ చేసింది.

గురువారం బెంగళూరు(Bangalore)లోని ఎం చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో శ్రీలంక(Srilanka)ను 5 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా న్యూజిలాండ్(New Zealand) వారి 4-మ్యాచ్‌ల పరాజయాల పరంపరను బ్రేక్ చేసింది. దీంతో కివీస్‌ 2023 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ రేసులో కూడా బలమైన స్థానంలో నిలిచింది. ప్ర‌స్తుతం న్యూజిలాండ్ 10 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే పాకిస్థాన్ ఓటమిపై ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఉంది.

బెంగళూరులో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఆల్ రౌండ్ ప్రదర్శన చేసింది. ట్రెంట్ బౌల్ట్(Trent Boult) 3 వికెట్లు తీసి శ్రీలంక ఇన్నింగ్స్‌ను షేక్ చేశాడు. మిచెల్ సాంట్నర్(Mitchel Santner), లాకీ ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర(Rachin Ravindra) రెండేసీ వికెట్లు పడగొట్టి శ్రీలంకను 171 పరుగులకే కట్టడి చేశారు. శ్రీలంక 10 వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. మహేష్ తిక్షణ 38 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు.

అనంత‌రం న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే (45), రవీంద్ర (42) జట్టుకు శుభారంభం అందించారు. శ్రీలంక పునరాగమనంపై ఎలాంటి ఆశలు లేకుండా చేశారు. వీరిద్దరూ వికెట్ కోల్పోకుండా కేవలం 12.2 ఓవర్లలో 86 పరుగులు జోడించి న్యూజిలాండ్‌కు వేగవంతమైన ఆరంభాన్ని అందించారు. ఓపెనర్ల వికెట్ల పతనం తర్వాత డారిల్ మిచెల్ 31 బంతుల్లో 43 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. నెట్ రన్ రేట్‌ను మరింత పెంచుకుని ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. శ్రీలంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ రెండు వికెట్లు తీయగా, చమీర, తీక్షణ తలో వికెట్ తీశారు. ఓటమితో శ్రీలంక ప్రపంచకప్ ప్రయాణం ముగిసింది. న్యూజిలాండ్ విధి ఇంగ్లాండ్ చేతిలో ఉంది.

Updated On 9 Nov 2023 10:36 PM GMT
Yagnik

Yagnik

Next Story