French Open 2023 : కాస్పర్ రూడ్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన నోవాక్ జకోవిచ్
సెర్బియా స్టార్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో గెలిచి టైటిల్ గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నోవాక్ జొకోవిచ్.. క్యాస్పర్ రూడ్‌ను వరుస సెట్లలో ఓడించాడు. ఓవరాల్‌గా నొవాక్ జకోవిచ్‌కి ఇది 23వ గ్రాండ్‌స్లామ్. తద్వారా అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న స్పెయిన్ ఆటగాడు రఫెల్ నాదల్‌ను నొవాక్ జొకోవిచ్ వెనక్కి నెట్టాడు.

Novak Djokovic reaches record 23 grand slam titles after French Open final win
సెర్బియా స్టార్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్(Novak Djokovic) ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో(French Open Final Match) గెలిచి టైటిల్ గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నోవాక్ జొకోవిచ్.. క్యాస్పర్ రూడ్(Casper Ruud)ను వరుస సెట్లలో ఓడించాడు. ఓవరాల్‌గా నొవాక్ జకోవిచ్‌కి ఇది 23వ గ్రాండ్‌స్లామ్. తద్వారా అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న స్పెయిన్(Spain) ఆటగాడు రఫెల్ నాదల్(Rafael Nadal)ను నొవాక్ జొకోవిచ్ వెనక్కి నెట్టాడు. రాఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్(Grand Slam Titles) సాధించాడు. ఫైనల్ మ్యాచ్‌లో నోవాక్ జొకోవిచ్ 7-6, 6-3, 7-5తో క్యాస్పర్ రూడ్‌ను ఓడించాడు.
నొవాక్ జొకోవిచ్ మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. అంతకుముందు జొకోవిచ్ 2012, 2014, 2015లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో ఓటమిని చవిచూశాడు. అయినా పోరాడి 2016 లో మొదటిసారి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. తర్వాత 2020లో మరోసారి రన్నరప్‌గా నిలిచాడు. 2021లో మళ్లీ ఛాంపియన్‌గా నిలిచాడు. నోవాక్ జకోవిచ్ ఇప్పటివరకు 34 పురుషుల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడటం విశేషం.
నోవాక్ జొకోవిచ్ మూడు ప్రెంచ్ ఓపెన్ టైటిళ్లతో పాటు.. 6 సార్లు వింబుల్డన్(Wimbledon), 4 సార్లు యూఎస్ ఓపెన్(US Open), 10 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్(Autralian Open) టైటిళ్లను గెలుచుకున్నాడు. ఇక జకోవిచ్ ఇప్పటివరకూ ఫ్రెంచ్ ఓపెన్‌లో 92 మ్యాచ్‌లు గెలుపొందగా.. 16 మ్యాచ్‌ల్లో ఓటమిని ఎదుర్కొన్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతని రికార్డు 89-8. అలాగే, వింబుల్డన్‌లో 86-10, యూఎస్ ఓపెన్‌లో 81-13తో జకోవిచ్ అత్యధిక మ్యాచ్‌లను నెగ్గిన రికార్డును కలిగి ఉన్నాడు.
