Lucknow Super Giants won by 7 wkts : ఉప్పల్‌లో నికోలస్ పూరన్ సిక్సర్ల మోత.. హైద్రాబాద్‌పై లక్నో విజయం
ఐపీఎల్-2023 58వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు ఆరంభం నుంచి తీవ్రంగా శ్రమించింది. చివరి 5 ఓవర్లలో జట్టు విజయానికి 68 పరుగులు అవసరం కాగా.. హైదరాబాద్ బౌలర్లు మ్యాచ్‌పై పట్టు కోల్పోయేలా.. విజృంబించి లక్నో బ్యాట్స్‌మెన్‌లు హైదరాబాద్ నుండి మ్యాచ్‌ను లాక్కొని లక్నోకు విలువైన విజయాన్ని అందించారు.
ఐపీఎల్-2023 58వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్(Lucknow Super Giants).. సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ను 7 వికెట్ల తేడాతో ఓడించి ప్లేఆఫ్స్(Playoffs) ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో లక్నో(Lucknow) జట్టు ఆరంభం నుంచి తీవ్రంగా శ్రమించింది. చివరి 5 ఓవర్లలో జట్టు విజయానికి 68 పరుగులు అవసరం కాగా.. హైదరాబాద్(Hyderabad) బౌలర్లు మ్యాచ్‌పై పట్టు కోల్పోయేలా.. విజృంబించి లక్నో బ్యాట్స్‌మెన్‌లు హైదరాబాద్ నుండి మ్యాచ్‌ను లాక్కొని లక్నోకు విలువైన విజయాన్ని అందించారు.
13 బంతుల్లో 44 పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు నికోలస్ పూరన్(Nicholas Pooran). 338 స్ట్రైక్ రేట్‌తో అతడు ఆడిన ఇన్నింగ్స్ కారణంగానే హైదరాబాద్‌ను లక్నో చిత్తు చేయగలిగింది. నికోలస్‌తో పాటు 45 బంతుల్లో అజేయంగా 64 పరుగులు చేసిన ప్రేరక్ మన్కడ్(Prerak Mankad), 25 బంతుల్లో 40 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) కూడా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.
16వ ఓవర్‌లో అభిషేక్ శర్మ(Abhishek Sharma) వేసిన ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్ రెండు సిక్సర్లు బాది ఔట్ అయిన వెంటనే.. నికోలస్ పూరన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. వచ్చి రావడమే తుఫాను సృష్టించాడు. తాను ఎదుర్కొన్న మొదటి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత నటరాజన్‌ను, భువనేశ్వర్ కుమార్ ను కూడా దీటుగా ఎదుర్కొని మ్యాచ్‌ను హైదరాబాద్ కు దూరం చేశాడు.
అంతకుముందు హైద్రాబాద్ బ్యాట్స్‌మెన్ అన్‌మోల్ ప్రీత్ సింగ్(Anmolpreet Singh)(36), త్రిపాఠి(20), మార్క్రామ్(28), హెన్రీచ్ క్లాసన్(47), సమద్(37) రాణించడంతో 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనకు దిగిన లక్నో జట్టులో డికాక్(29), మన్కడ్(64), స్టోయినిస్(40), పూరన్(44) పరుగులు చేశారు.