టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ జట్టు

టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ జట్టు షాక్ ఇచ్చింది. 84 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు నిర్ణత 20 ఓవర్లలో 159 రన్స్ చేయగా, లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ టీమ్ 15.2 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు బ్యాంటింగ్ చేసిన ఆఫ్ఘాన్ జట్టులో గుర్భాజ్ 80, జద్రాన్ 44 పరుగులతో రాణించగా.. బౌలింగ్ లో రషీద్ ఖాన్, ఫజల్‌హాక్ ఫారూఖీ 4, మహ్మద్ నబీ 2 వికెట్లు తీశారు.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘన్ ఓపెనర్లు గుర్భాజ్, ఇబ్రహీం జాద్రాన్ శుభారంభాన్ని ఇచ్చారు. 103 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. గుర్భాజ్ 80 పరుగులు చేయగా, జాద్రాన్ 44 పరుగులు చేశాడు. ఇక అజమ్తుల్లా 22 పరుగులు చేశాడు. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేసింది ఆఫ్ఘన్ జట్టు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, మ్యాట్ హెన్రీ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక ఛేజింగ్ లో న్యూజిలాండ్ కు మొదటి బంతికే షాక్ ఇచ్చింది ఆఫ్ఘన్. ఫిన్ ఆలెన్ ను మొదటి బంతికే ఫజల్ హాక్ ఫరూఖీ పెవిలియన్ కు పంపాడు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లుగానే పెవిలియన్ చేరుతూ వెళ్లారు. ఆఫ్ఘన్ స్పిన్నర్లను కనీసం అంచనా వేయలేకపోయారు కివీస్ బ్యాటర్లు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో గ్లెన్ ఫిలిప్స్ చేసిన 18 పరుగులే అత్యధిక స్కోరు. మ్యాట్ హెన్రీ ఆఖర్లో 12 పరుగులు చేశాడు. ఇక మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.

Updated On 7 Jun 2024 10:03 PM GMT
Yagnik

Yagnik

Next Story