ఐదు మ్యాచ్‌ల‌ టీ20 సిరీస్‌లో భాగంగా డునెడిన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐదు మ్యాచ్‌ల‌ టీ20 సిరీస్‌లో భాగంగా డునెడిన్ వేదికగా పాకిస్థాన్‌(Pakistan)తో జరిగిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్(New Zealand) 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమితో పాక్‌ సిరీస్ కోల్పోయింది. న్యూజిలాండ్ తరఫున ఫిన్ అలెన్(Finn Allen) ధీటుగా బ్యాటింగ్ చేసి సెంచరీ(137) సాధించాడు. ఫిన్ అలెన్‌ ఇన్నింగ్సులో ఏకంగా ఐదు బౌండ‌రీలు, 16 సిక్స‌ర్లు ఉన్నాయి. న్యూజిలాండ్ జ‌ట్టులో టిమ్ సౌథీ(Tim Southee) 2 వికెట్లు తీశాడు. పాక్‌ తరఫున బాబర్‌ ఆజం(Babar Azam) హాఫ్‌ సెంచరీ చేశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఓపెన‌ర్ ఫిన్ అలెన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 62 బంతులు ఎదుర్కొని 137 పరుగులు చేశాడు. అత‌డికి తోడు సీఫెర్ట్ 23 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేశాడు. హారీస్ రవూఫ్(Asad Rauf) పాక్ తరుపున 2 వికెట్లు పడగొట్టాడు. అయితే రవూఫ్ 4 ఓవర్లలో 60 పరుగులు ఇవ్వ‌డం విశేషం.

న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు జ‌ట్టులోకి వ‌చ్చిన‌ పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేసింది. పాక్ జ‌ట్టులో బాబర్ ఆజం అర్ధ సెంచరీ సాధించాడు. బాబర్ 37 బంతులు ఎదుర్కొని 58 పరుగులు చేశాడు. బాబర్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) 20 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఫఖర్ జమాన్(Fakhar Zaman) 10 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు. నవాజ్ 15 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేశాడు.

ఐదు టీ20ల సిరీస్‌లో పాకిస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగో మ్యాచ్ జనవరి 19న జరగనుంది. ఐదో, చివరి మ్యాచ్‌ జనవరి 21న జరగనుంది.

Updated On 16 Jan 2024 10:47 PM GMT
Yagnik

Yagnik

Next Story