World Cup Final : నేడు వరల్డ్ కప్ ఫైనల్.. రిజర్వ్ డే నుంచి DRS-నో బాల్ వరకూ రూల్స్ ఇవే..!
వన్డే ప్రపంచకప్ ఫైనల్ భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ రోజు జరుగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు దీనికి సంబంధించిన అనేక నిబంధనల గురించి చర్చ కూడా ప్రారంభమైంది.
వన్డే ప్రపంచకప్ ఫైనల్(World Cup Final) భారత్(India), ఆస్ట్రేలియా(Australia) మధ్య ఈ రోజు జరుగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు దీనికి సంబంధించిన అనేక నిబంధనల గురించి చర్చ కూడా ప్రారంభమైంది. ఎందుకంటే 2019 ప్రపంచకప్ ఫైనల్ సూపర్ ఓవర్(Super Over) టై అయిన తర్వాత ఫలితంపై చాలా వివాదాలు వచ్చాయి. అయితే ఈసారి ఆ రూల్‌ను అప్‌డేట్ చేయడంతోపాటు అనేక ఇతర రూల్స్ కూడా తీసుకువచ్చారు. ఫైనల్ మ్యాచ్‌కి సంబంధించి రిజర్వ్ డే, అదనపు సమయం, సూపర్ ఓవర్, DRS, DLS వంటి ప్రత్యేక నిబంధనల గురించి తెలుసుకుందాం.
సెమీ-ఫైనల్(Semi Final) మ్యాచ్‌ల మాదిరిగానే ఐసీసీ ఫైనల్‌కు కూడా రిజర్వ్ డే(Reserve Day) ఉంది. వర్షం(Rain) కారణంగా నవంబర్ 19న ఫలితం తేలకపోతే.. 19న ఎక్కడ ఆగిపోయిందో నవంబర్ 20న అక్కడి నుంచే మ్యాచ్ జరుగుతుంది. ఇది కాకుండా వర్షం పడితే 120 నిమిషాలు అంటే రెండు గంటల అదనపు సమయం ఉంటుంది. ఈ సమయంలో మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే రోజు నిర్వహిస్తారు. రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ జరగకపోతే ఇరు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.
గత ప్రపంచకప్‌లో అత్యంత చర్చనీయాంశమైన సూపర్ ఓవర్ నియమం గురించి మాట్లాడుకుందాం. మ్యాచ్ టై అయితే ఈ నియమం ఉంటుంది. కానీ 2019లో సూపర్ ఓవర్ కూడా టై అయింది.. ఆ తర్వాత మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు సాధించిన జట్టు అంటే ఇంగ్లాండ్(England)ను విజేతగా ప్రకటించారు. కానీ ఈసారి అలా జరగదు. సూపర్ ఓవర్ టై అయితే.. ఫలితం వెలువడే వరకు సూపర్ ఓవర్ ప్రక్రియను కొనసాగించాలని ఐసీసీ కోరింది.
ఫీల్డ్ అంపైర్ నో బాల్ ఇవ్వలేకపోతే థర్డ్ అంపైర్ నో బాల్ ఇవ్వవచ్చంటూ ఈసారి ఆటో నో బాల్ నిబంధన వచ్చింది. ఆటగాడు DRS తీసుకుంటే అల్ట్రా ఎడ్జ్, స్ప్లిట్ స్క్రీన్ మొదలైనవి చెక్ చేస్తారు. అలాగే, రెండు జట్లకు ఒక ఇన్నింగ్స్‌లో రెండు రివ్యూలు ఉంటాయి.