వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జ‌రిగిన‌ 15వ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ దక్షిణాఫ్రికాని ఓడించి సంచ‌ల‌నం న‌మోదు చేసింది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

వన్డే ప్రపంచకప్‌(World Cup)లో భాగంగా జ‌రిగిన‌ 15వ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌(Netherlands) దక్షిణాఫ్రికా(South Africa)ని ఓడించి సంచ‌ల‌నం న‌మోదు చేసింది. ధర్మశాల(Dharmashala)లోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(Himachal Pradesh Cricket Association Stadium)లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వ‌ర్షం కార‌ణంగా 43 ఓవ‌ర్ల‌కు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 245 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా జట్టు 42.5 ఓవ‌ర్ల‌లో 207 పరుగులకు ఆలౌటై 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ప్రపంచకప్‌లో ఇది రెండో అతిపెద్ద ఓటమి. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) ఇంగ్లండ్‌(England)ను ఓడించింది.

ఈ ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఆడిన‌ ఆఫ్రికాకు ఇదే తొలి ఓటమి. ఇంతకుముందు ఈ జట్టు శ్రీలంక(Srilanka), ఆస్ట్రేలియా(Australia)లను ఓడించినా.. నెదర్లాండ్స్ జట్టుపై గెల‌వ‌లేక‌పోయింది.

దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నెదర్లాండ్స్ ఆరంభం స‌రిగా లేదు. 82 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరింది. దీని తర్వాత కెప్టెన్ ఎడ్వర్డ్స్ టెయిలెండ‌ర్‌ బ్యాట్స్‌మెన్ అండ‌తో అద్భుతమైన భాగస్వామ్యాలు ఏర్పాటుచేసి జట్టుకు మంచి స్కోరుకు అందించాడు. నెదర్లాండ్స్ తరఫున కెప్టెన్ చార్లెస్ ఎడ్వర్డ్స్ అజేయంగా 78 పరుగులు చేయ‌గా.. వాన్ డెర్ మెర్వే 29 పరుగులు, ఆర్యన్ దత్ తొమ్మిది బంతుల్లో 23 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా తరఫున లుంగీ ఎన్‌గిడి, మార్కో జాన్‌సెన్‌, కగిసో రబడా రెండేసి వికెట్లు తీశారు. గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్ చెరో వికెట్ తీశారు.

246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా చ‌తికిల‌ప‌డింది. స్కోరు 36 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. 20 పరుగుల వద్ద డి కాక్ ఔటయ్యాడు. దీని తర్వాత బావుమా తన వ్యక్తిగత స్కోరు 16 పరుగుల వద్ద పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. మార్క్రామ్ ఒక పరుగు చేసి, డస్సెన్ నాలుగు పరుగులు చేసి అవుటయ్యారు. క్లాసెన్, మిల్లర్ ఐదో వికెట్‌కు 45 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా కొంత ఆశలు రేకెత్తించారు, అయితే క్లాసెన్ ఔట్ అయిన తర్వాత.. మిల్లర్ ఒంటరిగా మిగిలిపోయాడు. తొమ్మిది పరుగుల వ్య‌క్తిగ‌త‌ స్కోరు వ‌ద్ద‌ జాన్స‌న్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత మిల్లర్ కూడా 43 పరుగులు వ‌ద్ద పెవిలియ‌న్ చేరాడు.చివర్లో కేశవ్ మహరాజ్, లుంగీ ఎన్‌గిడి జోడీ జట్టు స్కోరును 207 పరుగులకు చేర్చింది. అయినప్పటికీ ఆ జట్టు 38 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

Updated On 17 Oct 2023 8:58 PM GMT
Yagnik

Yagnik

Next Story