ప్రపంచ ఛాంపియన్‌షిప్‌(World championship)లో జావెలిన్ త్రో ఈవెంట్‌(Javelin Throw Event)లో నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో తన తొలి ప్రయత్నంలోనే 88.77 మీటర్ల త్రో విసిరి శుక్రవారం ఫైనల్‌లోకి ప్రవేశించాడు. దీంతో పాటు 2024 పారిస్ ఒలింపిక్స్‌(Paris Olympic)కు అర్హత సాధించాడు.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌(World championship)లో జావెలిన్ త్రో ఈవెంట్‌(Javelin Throw Event)లో నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో తన తొలి ప్రయత్నంలోనే 88.77 మీటర్ల త్రో విసిరి శుక్రవారం ఫైనల్‌లోకి ప్రవేశించాడు. దీంతో పాటు 2024 పారిస్ ఒలింపిక్స్‌(Paris Olympic)కు అర్హత సాధించాడు. టోక్యో ఒలింపిక్ ఛాంపియన్ అయిన నీరజ్ చోప్రా కెరీర్‌లో అత్యుత్తమ నాల్గవ త్రోను విసిరాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో నీరజ్ చోప్రా గ్రూప్-ఎలో ఉన్నాడు. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే జావెలిన్ ను 85.50 మీటర్లు విస‌రాలి. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆగస్టు 27న జరగనుంది.

నీర‌జ్ చోప్రా 30 జూన్ 2022న స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో విసిరిన 89.94 మీ.. అత‌డి వ్యక్తిగత అత్యుత్తమ త్రో. గ్రూప్-ఎ, బి నుండి టాప్ 12 త్రోయర్లు లేదా 83 మీటర్ల కంటే ఎక్కువ విసిరిన వారు ఆదివారం ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధిస్తారు. నీరజ్ చోప్రా గతసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో రెండో స్థానంలో నిలిచి రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. వచ్చే ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్‌ ఒలింపిక్స్‌ జరగనున్నాయి.

Updated On 25 Aug 2023 5:28 AM GMT
Ehatv

Ehatv

Next Story