Neeraj Chopra : చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. దోహా డైమండ్ లీగ్ టైటిల్ కైవసం
టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మళ్లీ తన సత్తా చాటాడు. శుక్రవారం జరిగిన దోహా డైమండ్ లీగ్ టైటిల్‌ను నీరజ్ చోప్రా గెలుచుకున్నాడు. నీరజ్ విజయంపై కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రశంసలు కురిపించారు. నీరజ్ చోప్రా గెలిచినట్లు అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.

Neeraj Chopra clinches Doha Diamond League title records best throw of 88.67m
టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics) 2020లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన స్టార్ జావెలిన్ త్రోయర్(Javelin Throw) నీరజ్ చోప్రా(Neeraj Chopra)మళ్లీ తన సత్తా చాటాడు. శుక్రవారం జరిగిన దోహా డైమండ్ లీగ్ టైటిల్(Doha Diamond League title)ను నీరజ్ చోప్రా గెలుచుకున్నాడు. నీరజ్ విజయంపై కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Tagore) ప్రశంసలు కురిపించారు. నీరజ్ చోప్రా గెలిచినట్లు అనురాగ్ ఠాకూర్ ట్వీట్(Tweet) చేశారు. 88.67 మీటర్లు జావెలిన్‌ను విసిరి దోహా డైమండ్ లీగ్‌లో ఆధిపత్యం చెలాయించడంతో పాటు దేశానికి కీర్తిని తెచ్చాడు. దేశం గర్వించేలా చేసిన నిజమైన ఛాంపియన్(Champion). ఈ అద్భుతమైన విజయం సాధించినందుకు నీరజ్‌కి అభినందనలు అంటూ అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.
Neeraj Chopra wins! 🇮🇳
With a thunderous throw of 88.67m, he dominated the Doha Diamond League and brought glory home. A true champion who has made the nation proud again.
Congratulations Neeraj on this stupendous win! 🎉 pic.twitter.com/WqtkG4EdNs
— Anurag Thakur (@ianuragthakur) May 5, 2023
నీరజ్ దోహా డైమండ్ లీగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఖతార్‌లోని దోహాలో జరిగిన ఈ ఈవెంట్‌లో నీరజ్ తన తొలి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.67 మీటర్లు విసిరి అందరినీ వెనక్కి నెట్టాడు. ఈ విజయంతో నీరజ్ గతంలో అండర్సన్ పీటర్స్(Anderson Peters) చేతిలో పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. గతేడాది జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో ఫిట్‌నెస్(Fitness) లేకపోవడంతో నీరజ్ పాల్గొనలేకపోయాడు.
నీరజ్ మొదటి ప్రయత్నంలోనే జావెలిన్‌ను 88.67 మీటర్లు విసిరాడు. రెండో ప్రయత్నంలో 86.04 మీటర్ల దూరం విసిరాడు. 85.47 మీటర్లు మూడో ప్రయత్నంలో విసరగా.. నాలుగో ప్రయత్నంలో నీరజ్ ఫౌల్ చేశాడు. 5వ ప్రయత్నంలో 85.37 మీటర్లు, 6వ ప్రయత్నంలో 86.52 మీటర్లు జావెలిన్‌ను విసిరి నీరజ్ తన సత్తా చాటాడు.
