భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. 2022 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్.. ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం సాధించాడు. హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ అద్భుతం సృష్టించాడు.

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) చరిత్ర సృష్టించాడు. 2022 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్.. ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌(World Athletics Championship)లోనూ స్వర్ణం సాధించాడు. హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్‌(Javelin throw Event)లో నీరజ్ అద్భుతం సృష్టించాడు. నీరజ్ 88.17 మీటర్ల జావెలిన్ త్రోతో బంగారు పతకాన్ని(Gold Medal) గెలుచుకున్నాడు. ఫైనల్లో పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్‌(Arshad Nadeem)ను ఓడించి నీరజ్ ఛాంపియన్‌గా నిలిచాడు.

అర్షద్ నదీమ్ 87.82 మీటర్ల త్రోతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వెడ్లెచ్(Jakub Vadlejch) 86.67 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌లో నీరజ్‌తో పాటు మరో ఇద్దరు భారత ఆటగాళ్లు డిపి మను(DP Manu), కిషోర్ జెనా(Kishore Jena) ఉన్నారు. కిషోర్ 84.77 మీటర్లు విసిరి ఐదో స్థానంలో నిలవగా.. డిపి మను 84.14 మీటర్ల త్రోతో ఆరో స్థానంలో నిలిచాడు.

మ్యాచ్ అనంతరం నీరజ్ తన ప్రత్యేక శైలితో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. నీరజ్ మ్యాచ్ అనంత‌రం పాకిస్తాన్ అథ్లెట్‌ అర్షద్ తో కరచాలనం చేసి త‌న‌ను కౌగిలించుకున్నాడు. అనంతరం పోడియంపై కలిసి నిలబడ్డారు. ఆ సమయంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వెడ్లెచ్ కూడా అక్కడ ఉన్నాడు. ఈ వీడియో వైర‌ల్ అవుతుంది.

Updated On 27 Aug 2023 10:31 PM GMT
Yagnik

Yagnik

Next Story