World Cup Final : నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ రిపోర్ట్, ట్రాక్ రికార్డ్లివే..!
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఆటగాళ్లు భీకరమైన ఫామ్‌లో ఉండటంతో ఇరు జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది.
ప్రపంచకప్ 2023 ఫైనల్(World Cup Fina) మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్(Ahmadabad)లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో భారత్(India), ఆస్ట్రేలియా(Australia) మధ్య జరగనుంది. ఆటగాళ్లు భీకరమైన ఫామ్‌లో ఉండటంతో ఇరు జట్ల మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది. భారత్ మూడో టైటిల్(Third Title) పై కన్నేయగా.. ఆస్ట్రేలియా ఆరో టైటిల్(Sixth Title) కు గురిపెట్టింది. అహ్మదాబాద్‌లో టాస్ గెలిచిన జట్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఈ పిచ్ ఎవరికి సహాయం చేస్తుంది? అన్నీ తెలుసుకుందాం.
నరేంద్ర మోదీ మైదానంలో స్పిన్ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ నల్ల నేల పిచ్‌పై జరుగుతుందని.. అది స్పిన్నర్లకు సహకరిస్తుందని అంటున్నారు. క్రీజ్‌లో నిలదొక్కుకుంటే బ్యాట్స్‌మెన్ ఈ మైదానంలో పరుగులు చేయగలరు. అయితే అది అంత సులువు కాదని అంటున్నారు.
నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇప్పటివరకూ మొత్తం 32 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 17 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలవగా.. 15 మ్యాచ్‌ల్లో ఛేజింగ్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ వంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంటాడు, పిచ్‌ను పరిగణనలోకి తీసుకుంటే అదే నిర్ణయం కరెక్ట్ అవుతుంది. ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 237 కాగా, రెండో ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 207.
2023 ప్రపంచకప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ప్లేయింగ్ ఎలెవన్‌లో పెద్దగా మార్పులు చేయడం లేదు. హార్దిక్(Hardik Pandya) నిష్క్రమణ తర్వాత రోహిత్ ప్రతి మ్యాచ్‌లోనూ అదే పదకొండు మంది ఆటగాళ్లతో మైదానంలోకి దిగుతున్నాడు. అయితే నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరిగే టైటిల్ మ్యాచ్‌లో రోహిత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆర్ అశ్విన్‌కు అవకాశం ఇవ్వవచ్చని అంటున్నారు.
ఫైనల్ మ్యాచ్ జరగనున్న పిచ్ స్పిన్ బౌలర్లకు ఎంతగానో సహకరిస్తుందని భావిస్తున్న క్రమంలో అశ్విన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక అహ్మదాబాద్ మైదానంలో, ఆస్ట్రేలియాపై అశ్విన్ రికార్డు చాలా బాగుంది.
అశ్విన్(Ashwin) ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వస్తే మాత్రం మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) ను తప్పించే అవకాశం ఉంది. ఫైనల్ లాంటి భారీ మ్యాచ్‌లో రోహిత్‌కి అశ్విన్ అనుభవం కూడా ఉపయోగపడుతుంది. అశ్విన్ నెట్స్‌లో కూడా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అదే సమయంలో గత కొన్ని మ్యాచ్‌లుగా సిరాజ్ ప్రదర్శన కూడా అంతగా బాలేదు.