ఐపీఎల్ 2024 55వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అజేయ సెంచరీతో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది

ఐపీఎల్ 2024 55వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అజేయ సెంచరీతో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్‌కు ఆరంభం చాలా పేలవంగా ఉంది. స్కోరు 31 వద్ద రోహిత్, ఇషాన్, నమన్ దార్ వికెట్లను ముంబై కోల్పోయింది. ఇక్కడి నుంచి సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ బాధ్యతలు చేపట్టారు.

సూర్య-తిలక్ మధ్య 79 బంతుల్లో 143 పరుగుల అజేయ భాగస్వామ్యం ఏర్ప‌డింది. సూర్యకుమార్ 51 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తిలక్ వర్మ 32 బంతుల్లో 37 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడి సూర్యకు స‌హ‌కారం అందించాడు.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబైపై తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు శుభారంభం అందించారు. జట్టు తరఫున ఓపెనర్ ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 48 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతనితో పాటు కెప్టెన్ పాట్ కమిన్స్ చివర్లో ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేసి అజేయంగా 35 పరుగులు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్కోరు 173 పరుగులకు చేర్చాడు.

Updated On 6 May 2024 8:50 PM GMT
Yagnik

Yagnik

Next Story