MI vs LSG : ఆఖరి మ్యాచ్‌లోనూ ఓడిన ముంబై ఇండియన్స్.. గెలిచినా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించని లక్నో
IPL 2024లో 67వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన ముంబై మొదట బ్యాటింగ్ చేసే అవకాశం లక్నోకు ఇచ్చింది.
IPL 2024లో 67వ మ్యాచ్ ముంబై ఇండియన్స్(Mumbai Indians), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Gaints) మధ్య జరిగింది. టాస్ గెలిచిన ముంబై మొదట బ్యాటింగ్ చేసే అవకాశం లక్నోకు ఇచ్చింది. కేఎల్ రాహుల్ సేన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్‌పై లక్నో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ముంబై జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ విజయంలో లక్నో 14 పాయింట్లకు చేరుకున్నప్పటికీ.. నెట్ రన్ రేట్ -0.667 తక్కువగా ఉంది. దీంతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించలేకపోయింది. ముంబై ఇండియన్స్ ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ లో దారుణంగా విఫలమైంది. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించింది. బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్‌లు తొలి వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా.. వీరి జోడిని నవీన్-ఉల్-హక్ విడతీశాడు. హక్ తొమ్మిదో ఓవర్లో డెవాల్డ్ బ్రూయిస్‌ను అవుట్ చేశాడు. బ్రూయిస్ 20 బంతుల్లో 23 పరుగులు చేయగలిగాడు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 10 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 16 పరుగులు, నెహాల్ వధేరా ఒక పరుగు, ఇషాన్ కిషన్ 14 పరుగులు చేశారు. నమన్ ధీర్ 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 62 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్సులో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. రొమారియో షెపర్డ్ ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లక్నో తరఫున రవి బిష్ణోయ్, నవీన్-ఉల్హాక్ చెరో రెండు వికెట్లు తీశారు. కృనాల్ పాండ్యా, మొహ్సిన్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.