మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో చివరి బంతికి ముంబై విజయం సాధించింది. చివరి బంతికి సిక్స్ కొట్టి ఢిల్లీపై నాలుగు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది ముంబై.

మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో చివరి బంతికి ముంబై విజయం సాధించింది. చివరి బంతికి సిక్స్ కొట్టి ఢిల్లీపై నాలుగు వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది ముంబై. ఈ విజ‌యంలో చివ‌రి బంతికి సిక్స్ కొట్టి ఎస్ సంజన కీలక పాత్ర పోషించింది. విజయం తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ సంజనను ప్రశంసిస్తూ కనిపించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌.. ముంబై ఇండియన్స్‌కు 172 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ తరుపున ఆలిస్ క్యాప్సీ 75 పరుగులు, జెమిమా రోడ్రిగ్స్ 42 పరుగులతో రాణించారు. అనంత‌రం ఛేద‌న‌కు దిగిన ముంబయి బ్యాట్స్‌వుమెన్‌లో యస్తికా భాటియా 57 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 55 పరుగులు చేసింది. అమేలియా కెర్ 24 పరుగులు చేసింది. దీంతో చివ‌రి బంతికి 173 ప‌రుగులు చేసి విజ‌యం సాధించింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. మేము ఎక్కడ ముగించామో అక్కడి నుండి ప్రారంభించాము. మేం ఆడిన తీరుకు నిజంగా సంతోషంగా ఉంది. నా బ్యాటింగ్ కోచ్ హిమాన్షు భయ్యాకి క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నాను. అతను నన్ను కష్టపడి ప్రాక్టీస్ చేయించాడు. నాకు శక్తిని ఇచ్చాడు. నేను దేశవాళీ క్రికెట్ ఆడటం లేదు. నాకు ఆరోగ్యం బాగాలేదు. మానసికంగా ఆ విరామం నాకు సహాయపడింది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ బాగా కనిపించింది, మేము గేమ్‌ను గెలవగలమని భావించాము. ప్రాక్టీస్ సెషన్లలో సంజ‌న‌ సిక్సర్లు కొట్టింది. అదే ఆమె ఈ రాత్రి మాకు చూపించిందని సంజ‌న‌ను కొనియాడింది.

Updated On 23 Feb 2024 9:10 PM GMT
Yagnik

Yagnik

Next Story