Punjab Kings vs Mumbai Indians : సిక్స్‌తో ముంబైకి విజయాన్ని అందించిన తిలక్ వర్మ
ఐపీఎల్ 46వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జవాబుగా ముంబై 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 216 పరుగులు చేసి విజయం సాధించింది.
ఐపీఎల్ 46వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను ఓడించింది. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం(Punjab Cricket Assosiation Stadium)లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్(Punjab) నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. జవాబుగా ముంబై(mumbai) 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 216 పరుగులు చేసి విజయం సాధించింది.
ముంబై ఇండియన్స్.. పంజాబ్ కింగ్స్‌ను ఓడించి టోర్నీలో ఐదో విజయాన్ని అందుకుంది. ముంబై జట్టులో ఇషాన్ కిషన్(Ishan Kishan), సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) అర్ధసెంచరీలతో విజృంభించగా.. తిలక్ వర్మ(Tilak Varma), టిమ్ డేవిడ్(Tim David) మ్యాచ్‌ను స్టైల్‌గా ముగించారు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. పంజాబ్ బ్యట్స్‌మెన్‌లలో ధవన్(Dhawan)(30), మథ్యూ షార్ట్(Mathew Short)(27), లివింగ్ స్టన్(Livingstone)(82) ఝితేష్ శర్మ(Jithesh Sharma)(49) రాణించారు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా(Piyush Chawla)కు రెండు వికెట్లు దక్కాయి.
అనంతరం ముంబై 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 216 పరుగులు చేసి విజయం సాధించింది. ముంబై తరఫున ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మూడో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్ 41 బంతుల్లో 75(ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో 66(ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) పరుగులు చేశాడు. చివర్లో తిలక్ వర్మ వేగంగా పరుగులు సాధించి మ్యాచ్ ను ముగించాడు. తిలక్ 10 బంతుల్లో అజేయంగా 26(ఒక ఫోర్, మూడు సిక్సర్లు) పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 10 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 19 పరుగులు చేశాడు. తిలక్ 18వ ఓవర్ ఐదో బంతిని సిక్సర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఇల్లీస్ రెండు వికెట్లు పడగొట్టాడు.