చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మోకాలికి చికిత్సపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం ముంబైలోని స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్ స్పెషలిస్ట్‌ను సంప్రదించనున్నారు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ బుధవారం వెల్లడించారు.

చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) తన మోకాలికి చికిత్సపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం ముంబైలోని స్పోర్ట్స్ ఆర్థోపెడిక్స్ స్పెషలిస్ట్‌ను సంప్రదించనున్నారు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్(CSK CEO Kasi Viswanathan) బుధవారం వెల్లడించారు. ఐపీఎల్ సమయంలో ఎడమ మోకాలి గాయంతో ధోనీ ఇబ్బంది పడ్డాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ప్రత్యేకంగా బ్యాండేజీ కట్టుకుని బ‌రిలో దిగేవాడు.

ఐపీఎల్ లో ధోనీ చాలావ‌ర‌కూ లోయ‌ర్‌ ఆర్డర్‌(Lower Order)లో బ్యాటింగ్ చేశాడు. ఎందుక‌ని కాశీ విశ్వనాథన్ ను ప్రశ్నించగా.. ఎక్కువ పరుగెత్త‌లేడ‌ని చెప్పాడు. "అవును, ధోనీ తన ఎడమ మోకాలి గాయానికి వైద్య సలహా తీసుకుంటున్నాడు. తదనుగుణంగానే ధోనీ నిర్ణయం తీసుకుంటాడని విశ్వనాథన్ చెప్పారు.

వచ్చే సీజన్‌(Next IPL Season)లో ఆడకూడదని ధోనీ నిర్ణయించుకున్నాడా.. మినీ వేలం(Mini IPL Auction)లో రూ.15 కోట్లు(ధోనీ ఐపీఎల్ ధ‌ర‌) ఖ‌ర్చు చేసే అవకాశం ఉందా? అని అడ‌గ్గా సీఈవో కాశీ విశ్వనాథన్ బ‌దులిస్తూ.. "నిజాయితీగా చెప్పాలంటే.. మేము ఆ దశకు చేరుకోలేదు.. మేము ఆ దిశగా కూడా ఆలోచించడం లేదు.. ఇది పూర్తిగా ధోనీ నిర్ణయం. సీఎస్‌కే ఈ విషయాలను పరిగణించలేదని స‌మాధాన‌మిచ్చారు.

ఐదో ఐపీఎల్ ట్రోఫీ(IPL Trophy) తర్వాత ఆటగాళ్లను ఉద్దేశించి సీఎస్‌కే చీఫ్ ఎన్ శ్రీనివాసన్(CSK Cheif Srinivasan) మాట్లాడారా అని ప్ర‌శ్నించ‌గా.. ఆయ‌న‌ చాలా సంతోషంగా ఉన్నారు.. కానీ వేడుకలు జరుప‌లేదు. ఆటగాళ్లు అహ్మదాబాద్‌(Ahmadabad) నుంచే తమ తమ గమ్యస్థానాలకు బయలుదేరారు. మీరు సీఎస్‌కేను చూసినట్లయితే.. మేము ఎప్పుడూ వేడుక‌లు జరుపుకోము అని బదులిచ్చారు.

Updated On 31 May 2023 8:24 PM GMT
Yagnik

Yagnik

Next Story