ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సీఎస్‌కే ఐదోసారి ఐపీఎల్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. చివరి ఓవర్లో రవీంద్ర జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేసి సీఎస్‌కేకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. జడ్డూ చివరి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఫోర్ కొట్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై జట్టుకు ఐదోసారి గెలిచే సువర్ణావకాశాన్ని అందించాడు.

ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌(IPL Final Match)లో గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)పై చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సీఎస్‌కే(CSK) ఐదోసారి ఐపీఎల్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. చివరి ఓవర్లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) అద్భుతంగా బ్యాటింగ్ చేసి సీఎస్‌కేకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. జడ్డూ చివరి రెండు బంతుల్లో ఒక సిక్స్, ఫోర్ కొట్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(Indian Premier League)లో చెన్నై జట్టుకు ఐదోసారి గెలిచే సువర్ణావకాశాన్ని అందించాడు. అయితే ధోనీ(Dhoni) మ్యాచ్ చివరి బంతి(Last Ball)ని చూసే ధైర్యం చేయలేకపోయాడు. చివరి బంతి వేసే సమయంలో ధోనీ త‌ల దించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.

ఆఖరి మ్యాచ్‌లో బ్యాటంగ్‌కు దిగిన‌ ధోనీ.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. మోహిత్ శర్మ(Mohit Sharma) ధోనీని పెవిలియన్ చేర్చాడు. పెవిలియన్‌కు తిరిగి వస్తున్న సమయంలో ధోనీ చాలా నిరాశగా కనిపించాడు. అప్ప‌టినుండి మ్యాచ్ అయిపోయేవ‌ర‌కూ అదే నిరాశ‌. చివరి బంతికి రవీంద్ర జడేజా ఫోర్ కొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఆ స‌మ‌యంలో నిరాశగా చూస్తున్న ధోనీ ముఖంలో చిరునవ్వు మెరిసింది.

చివ‌రి బంతికి ఫోర్ కొట్టి సీఎస్‌కేకు విజ‌యాన్ని అందించిన‌ జడేజా.. గ్రౌండ్ లో ప‌రుగెత్తుతూ ఘనంగా సంబ‌రాలు జరుపుకున్నాడు. ఆపై అతను చెన్నై డ్రెస్సింగ్ రూమ్(Chennai Dressing Room) వైపు పరుగెత్తాడు. జడేజా.. ధోనీ ద‌గ్గ‌రికి వెళ్ల‌గానే.. జడ్డూను తన ఒడిలోకి తీసుకుని ఊపుతూ అతడిని కౌగిలించుకున్నాడు. సంబ‌రాల‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ అవుతున్నాయి.

Updated On 29 May 2023 10:28 PM GMT
Yagnik

Yagnik

Next Story