Lucknow Super Giants won by 5 runs : చివరి ఓవర్లో 11 పరుగులు చేయలేక లక్నోపై ఓడిన ముంబై
నిన్న ముంబై ఇండియన్స్‌పై లక్నో సూపర్ జెయింట్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో లక్నో జట్టు ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది. అదే సమయంలో ముంబైకి ప్లేఆఫ్ రేసు కష్టంగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
నిన్న ముంబై ఇండియన్స్(Mumbai Indians)పై లక్నో సూపర్ జెయింట్(Lucknow Super Giants) ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో లక్నో జట్టు ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చింది. అదే సమయంలో ముంబైకి ప్లేఆఫ్ రేసు(Playoffs) కష్టంగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై(Mumbai) ఇండియన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో(Lucknow) 177 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ముంబై జట్టు కేవలం 172 పరుగులు మాత్రమే చేసి ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది.
ముంబై ఇండియన్స్‌పై లక్నో సూపర్ జెయింట్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 177 పరుగులు చేసింది. దీనికి లక్నో తరఫున మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) అత్యధికంగా అజేయంగా 89 పరుగులు చేశాడు. కెప్టెన్ కృనాల్ పాండ్యా(Krunal Pandya) 49 పరుగులతో పర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండార్ఫ్ రెండు వికెట్లు తీశాడు. ముంబై జట్టులో ఇషాన్ కిషన్(Ishan Kishan) 59, రోహిత్ శర్మ(Rohit Sharma) 37 పరుగులు చేశారు. టిమ్ డేవిడ్(Tim David) 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్ వేసిన లక్నో బౌలర్ మొహ్సిన్ 11 పరుగులు చేయకుండా ముంబైను అడ్డుకున్నాడు. ఇక లక్నో తరఫున యశ్ ఠాకూర్(Yash Takur), రవి బిష్ణోయ్(Ravi Bishnoi) చెరో రెండు వికెట్లు తీశారు.