Mohammed Siraj : టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సిరాజ్ చేసిన ట్వీట్‌పై ట్రోలింగ్
టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ చేసిన ట్వీట్‌పై పలువురు స్పందించారు.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ చేసిన ట్వీట్‌పై పలువురు స్పందించారు. సిరాజ్ "అల్లాకు ధన్యవాదాలు" అంటూ చేసిన ట్వీట్‌పై పలువురు నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. జట్టు కప్పును ఎత్తుతున్న ఫోటోను షేర్ చేస్తూ సిరాజ్ తన ట్వీట్‌లో "సర్వశక్తిమంతుడైన అల్లాకు ధన్యవాదాలు" అని రాశాడు.
It's Victory of Team India not Allah
— Chandan Sharma (@ChandanSharmaG) June 29, 2024
It's Victory of Captain Rohit Sharma
It's Victory of Team 11
It's Victory of 1.1 Billion Nationalist Citizens of India.
Why everything attaching with Islam?
ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు సిరాజ్‌తో పాటు భారత జట్టులోని ఇతర సభ్యులను అభినందించారు. అయితే కొందరు నెటిజన్లు ఆయనను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఒక ట్విటర్ యూజర్.. “ఇది టీమ్ ఇండియా విజయం అల్లాది కాదు” అని రాశాడు. మరొక వ్యక్తి "అల్లా అలా చేసి ఉంటే పాకిస్తాన్ ప్రపంచ కప్ గెలిచేది.. భారతదేశం కాదు" అని రాశాడు. మరికొంతమంది కూడా సిరాజ్ ట్వీట్‌పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే.. వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో యావత్ భారత్ ఉండగా.. కొందరు మాత్రం ఆటగాళ్లను ట్రోల్ చేస్తూ మానసిక ఆనందం పొందుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Ye kya bol diya siraj na team ko thanks na hi players ko sidhe Allah ko thanks bol diya gajab ho bhai tum bhi .?
— Deepu Kumar Pal (@DeepuKumar5576) June 30, 2024