ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఓడింది. అయితే టోర్నమెంట్‌లో అద్భుతమైన ఆటతీరు క‌న‌బ‌రిచిన‌ మహ్మద్ షమీ ఎప్పటికీ గుర్తుండిపోతాడు. 33 ఏళ్ల ష‌మీ ప్రపంచ కప్ 2023లో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడాడు.

ప్రపంచ కప్ 2023 ఫైనల్(World Cup Final) మ్యాచ్‌లో భారత జట్టు(Teamindia) ఓడింది. అయితే టోర్నమెంట్‌లో అద్భుతమైన ఆటతీరు క‌న‌బ‌రిచిన‌ మహ్మద్ షమీ(Mohammed Shami) ఎప్పటికీ గుర్తుండిపోతాడు. 33 ఏళ్ల ష‌మీ ప్రపంచ కప్ 2023లో మొత్తం ఏడు మ్యాచ్‌లు ఆడాడు. ఏడు ఇన్నింగ్స్‌లలో 10.70 సగటుతో గరిష్టంగా 24 వికెట్లు తీశాడు. దీంతో ప‌లు రికార్డులు కైవ‌సం చేసుకున్నాడు.

2023 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా షమీ రికార్డు సృష్టించాడు. రెండో స్థానంలో ఆస్ట్రేలియా(Australia) స్పిన్నర్ ఆడమ్ జంపా ఉన్నాడు. టోర్నీలో జంపా(Adam Zampa) మొత్తం 11 మ్యాచ్‌లు ఆడాడు. అతడు 11 ఇన్నింగ్స్‌లలో 22.39 సగటుతో 23 వికెట్లు తీయగలిగాడు.

2023 ప్రపంచకప్‌లో అత్యుత్తమ బౌలింగ్ సగటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ది. అతను ఏడు సగటుతో ఏడు పరుగులు మాత్ర‌మే ఇచ్చాడు. ఆ తర్వాత మహ్మద్ షమీ ఉన్నాడు. టోర్నీలో షమీ 10.70 సగటుతో 257 పరుగులిచ్చి 24 వికెట్లు పడగొట్టాడు.

2023 ప్రపంచకప్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ రికార్డు కూడా షమీ పేరిటే నమోదైంది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత ఫాస్ట్ బౌలర్ 57 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు.

2023 ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన ఘనత కూడా మహ్మద్ షమీ పేరిటే నమోదైంది. టోర్నీలో అతను మూడుసార్లు ఐదు వికెట్లు తీశాడు. ఒకసారి నాలుగు వికెట్లు కూడా ప‌డ‌గొట్టాడు. షమీ 12.20 స్ట్రైక్ రేట్‌తో 257 పరుగులు ఇచ్చి 24 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Updated On 19 Nov 2023 10:17 PM GMT
Yagnik

Yagnik

Next Story