ఐపీఎల్ 2024 11వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఎకానా స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ‌రిలోకి దిగాడు.

ఐపీఎల్ 2024 11వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ఎకానా స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ‌రిలోకి దిగాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పంజాబ్ కింగ్స్ జట్టుకు 200 పరుగుల లక్ష్యాన్ని అందించగా.. దానికి సమాధానంగా పంజాబ్ కింగ్స్ జట్టు 178 పరుగులకే ఆలౌటైంది. పంజాబ్ తరుపున శిఖర్ ధావన్ 70 పరుగులు చేసినా కానీ జట్టును గెలిపించలేకపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్ జ‌ట్టులో మయాంక్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు నికోలస్ పూరన్(42), క్వింటన్ డి కాక్(54) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఆటగాళ్ల కారణంగానే ఎల్‌ఎస్‌జీ జట్టు మ్యాచ్‌లో విజయం సాధించింది.

Updated On 30 March 2024 10:29 PM GMT
Yagnik

Yagnik

Next Story