Australia vs Afghanistan : వారెవ్వా మాక్స్‌వెల్.. డబుల్ సెంచరీతో అసీస్‌ను సెమీస్‌కు చేర్చాడు..!
వన్డే ప్రపంచకప్ 2023లో 39వ మ్యాచ్ ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది.

Maxwell hits double century, drives Australia to beat AFG by 3 wickets
వన్డే ప్రపంచకప్(World Cup) 2023లో 39వ మ్యాచ్ ఆస్ట్రేలియా(Australia), ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. ముంబై(Mumbai)లోని వాంఖడే స్టేడియం(Wankhede Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 291 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా ఏడు వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసి విజయం సాధించింది.
ఆఫ్ఘనిస్థాన్‌పై ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో కంగారూ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌కు చేరిన మూడో జట్టు ఆస్ట్రేలియా. ఇప్పుడు నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్(Newzealand), పాకిస్థాన్(Pakistan), ఆఫ్ఘనిస్థాన్ మధ్య పోటీ నెలకొంది.
మ్యాచ్ విషయానికొస్తే ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఇబ్రహీం జద్రాన్(Ibrahim Zadran) అత్యధికంగా అజేయంగా 129 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్(Rashid Khan) 35 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) రెండు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్(Mitchell Starc), గ్లెన్ మాక్స్‌వెల్(glenn maxwell), ఆడమ్ జంపా(Adam Zampa)లకు తలో వికెట్ దక్కింది.
అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. 91 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 100కే ఆలౌట్ అవుత్తి అనుకున్నారు. అప్పుడే వచ్చాడు మ్యాక్స్‌వెల్.. తొలుత ఆచిచూచి ఆడిన మాక్స్‌వెల్ ఒక్కడే 201 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ పాట్ కమిన్స్(12)తో కలిసి 202 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. మిచెల్ మార్ష్(24) ఇక్కడే ఆస్ట్రేలియా జట్టులో చెప్పకోదగ్గ ఇన్నింగ్సు ఆడాడు. ఆఫ్ఘనిస్థాన్ తరఫున నవీన్ ఉల్ హక్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు తీశారు.
