Mandeep Singh : రోహిత్ శర్మను ధాటేసిన మన్‌దీప్ సింగ్.. అదో చెత్త రికార్డులే..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) అద్భుత విజయంతో ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) కేకేఆర్ కు విజయాన్ని అందించాడు. కేకేఆర్ బౌలింగ్‌లో స్పిన్నర్ల ఆధిపత్యం కూడా కనిపించింది. కేకేఆర్ టీమ్ మొత్తం ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుండగా.. ఆ టీమ్‌కు చెందిన మరో ఆటగాడిని నెటిజన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఓ చెత్త రికార్డును […]
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) అద్భుత విజయంతో ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్(Shardul Thakur) కేకేఆర్ కు విజయాన్ని అందించాడు. కేకేఆర్ బౌలింగ్‌లో స్పిన్నర్ల ఆధిపత్యం కూడా కనిపించింది. కేకేఆర్ టీమ్ మొత్తం ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుండగా.. ఆ టీమ్‌కు చెందిన మరో ఆటగాడిని నెటిజన్స్ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్న ఆ ఆటగాడి గురించి తెలుసుకుందాం.
కేకేఆర్ ఓపెనర్ మన్‌దీప్ సింగ్(Mandeep Singh).. ఇప్పటివరకు జరిగిన రెండు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనూ నిరాశపరిచాడు. పంజాబ్ కింగ్స్‌పై మన్‌దీప్ 4 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఈ గోల్డెన్ డక్(Golden Duck) తో ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా మన్‌దీప్ నిలిచాడు. ఈ క్రమంలోనే.. మన్‌దీప్.. రోహిత్ శర్మ (14), దినేష్ కార్తీక్ (14)లను ధాటేశాడు.
మన్‌దీప్ సింగ్ - 15 (97 ఇన్నింగ్స్‌లు), దినేష్ కార్తీక్ - 14 (210 ఇన్నింగ్స్), రోహిత్ శర్మ - 14 (223 ఇన్నింగ్స్), పీయూష్ చావ్లా - 13 (82 ఇన్నింగ్స్‌లు), హర్భజన్ సింగ్ - 13 (90 ఇన్నింగ్స్) లు టాప్-5 లో ఉండి చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. వీరే కాకుండా పార్థివ్ పటేల్, అజింక్యా రహానే, అంబటి రాయుడులు 13 సార్లు డకౌట్ అయ్యారు. మరోవైపు ఐపీఎల్‌లో రషీద్ ఖాన్, సునీల్ నరైన్, గ్లెన్ మాక్స్‌వెల్, గౌతమ్ గంభీర్, మనీష్ పాండేలు 12 సార్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు.
అయితే ..ఈ విషయంలో మన్‌దీప్ సింగ్ రికార్డు చాలా పేలవంగా ఉంది. మన్‌దీప్ తన ఐపీఎల్(IPL-2023) కెరీర్‌లో మొత్తం 110 మ్యాచ్‌లు ఆడి 1,694 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 20.91. స్ట్రైక్ రేట్ 123.02. కేవలం 6 అర్ధసెంచరీలు మాత్రమే చేశాడు. 2010లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన మన్‌దీప్.. ఇప్పటివరకు ఏ సీజన్‌లోనూ తనదైన ముద్ర వేయలేకపోయాడు.
ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో మన్‌దీప్ సింగ్‌పై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. ప్రతీ సీజన్‌లో మన్‌దీప్ ఐపీఎల్ కాంట్రాక్టును ఎలా పొందుతున్నాడని అడుగుతున్నారు. అలాగే.. అజింక్య రహానెని రిటైన్ చేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రోల్స్.. ఫ్యాన్స్ నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో మేనేజ్‌మెంట్ మన్‌దీప్‌కు మరోసారి అవకాశం ఇస్తుందా లేదో చూడాలి మరి.