లండన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రీమియర్‌ లీగ్‌(Premier League)లో అనూహ్యఘటన చోటు చేసుకుంది. గ్రౌండ్‌లో ఫుట్‌బాల్‌(Football) ఆడుతూనే ల్యూటన్‌ టౌన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌(Luton Town FC) కెప్టెన్‌ టామ్‌ లాక్‌యర్ (Tom Lockyer)ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. డిసెంబర్‌ 16వ తేదీన బౌర్నెమౌత్‌ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. అప్పటికీ రెండు జట్లు చెరో గోల్‌ చేశాయి. మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతున్న తరుణంలో 29 ఏళ్ల లాక్‌యర్‌ చాతీ నొప్పితో బాధపడ్డాడు.

లండన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ప్రీమియర్‌ లీగ్‌(Premier League)లో అనూహ్యఘటన చోటు చేసుకుంది. గ్రౌండ్‌లో ఫుట్‌బాల్‌(Football) ఆడుతూనే ల్యూటన్‌ టౌన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌(Luton Town FC) కెప్టెన్‌ టామ్‌ లాక్‌యర్ (Tom Lockyer)ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. డిసెంబర్‌ 16వ తేదీన బౌర్నెమౌత్‌ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ విషాద ఘటన జరిగింది. అప్పటికీ రెండు జట్లు చెరో గోల్‌ చేశాయి. మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతున్న తరుణంలో 29 ఏళ్ల లాక్‌యర్‌ చాతీ నొప్పితో బాధపడ్డాడు. కొన్ని క్షణాల్లోనే గుండెకొట్టుకోవడం ఆగిపోయింది. ఆట మొదలైన 65వ నిమిషంలో ఈ ఘటన జరిగింది. ఉన్న చోటునే మైదానంలో కుప్పకూలిపోయాడు లాక్‌యర్‌. ఇది గమనించిన తోటి ఆటగాళ్లు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే గ్రౌండ్ సిబ్బందిని పెలించారు. వారు కూడా క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతడిని స్ట్రెచర్‌ మీద స్టేడియంలో అందుబాటులో ఉన్న వైద్యసిబ్బంది దగ్గరకు తీసుకెళ్లారు. వారు అతడికి అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. లాక్‌యర్‌ ఆసుపత్రి పాలవ్వడంతో రిఫరీలు మ్యాచ్‌ను రద్దు చేశారు.
లాక్‌య‌ర్ ప్రాణాలు కాపాడిన‌ రెండు జట్ల వైద్య సిబ్బందికి ల్యూట‌న్ టౌన్ ఫుట్‌బాల్ క్ల‌బ్ మేనేజ్‌మెంట్ ధ‌న్య‌వాదాలు తెలిపింది. ప్ర‌స్తుతం లాయ్‌క‌ర్ ఆరోగ్యం నిల‌క‌డగా ఉంది. అత‌డు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడు.

Updated On 18 Dec 2023 5:26 AM GMT
Ehatv

Ehatv

Next Story