RCB vs LSG : నికోలస్ పూరన్ విధ్వంసం.. ఆర్సీబీపై లక్నో థ్రిల్లింగ్ విక్టరీ
ఐపీఎల్-2023లో 15వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఆర్‌సీబీ జట్టులో కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ(Virat Kohli), గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) లు అర్ధసెంచరీలతో రాణించారు. చేధనకు దిగిన లక్నో […]
ఐపీఎల్-2023లో 15వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఆర్‌సీబీ జట్టులో కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ(Virat Kohli), గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) లు అర్ధసెంచరీలతో రాణించారు. చేధనకు దిగిన లక్నో జట్టు చివరి ఓవర్‌లో లక్ష్యాన్ని ఛేదించింది. లక్నో జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి విజయం సాధించింది.
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్‌లు ఇన్నింగ్సును ప్రారంభించారు. తొలి వికెట్‌కు వీరిరువురు 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 61 పరుగులు(4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేశాడు. విరాట్ ఔటైన తర్వాత కెప్టెన్ ఫాఫ్ వేగం పెంచాడు. కోహ్లీ అవుటైన తర్వాత మైదానంలోకి వచ్చిన మ్యాక్స్ వెల్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 203.45 స్ట్రైక్ రేట్‌తో 59 పరుగులు చేశాడు.
213 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన లక్నోకు శుభారంభం దక్కలేదు. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్(30 బంతుల్లో 65 పరుగులు) అద్భుత ఇన్నింగ్సుతో గాడిలో పడింది. నికోలస్ పూరన్ కూడా 19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ ఇన్నింగ్స్ లక్నోను విజయానికి చేరువ చేసింది. అయితే చివర్లో లక్నో బ్యాట్స్‌మెన్ తడబడినా.. ఆఖరి బంతికి మ్యాచ్ గెలిచారు.
రెండు జట్లలో ప్లేయింగ్ ఎలెవెన్ :
లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (సి), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్), జయదేవ్ ఉనద్కత్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (సి), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (WK), అనుజ్ రావత్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్