రాజస్థాన్ రాయల్స్ తమ అద్భుత ప్రదర్శనను కొనసాగించి ఏకపక్షంగా లక్నో సూపర్‌జెయింట్‌ను ఓడించింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు ఇది ఎనిమిదో విజయం.

రాజస్థాన్ రాయల్స్ తమ అద్భుత ప్రదర్శనను కొనసాగించి ఏకపక్షంగా లక్నో సూపర్‌జెయింట్‌ను ఓడించింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు ఇది ఎనిమిదో విజయం. పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విజ‌యంతో రాజస్థాన్‌ ప్లేఆఫ్‌కు మరింత చేరువ‌య్యింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌, ధ్రువ్‌ జురెల్‌ అద్భుత అజేయ అర్ధ సెంచరీల‌తో రాజస్థాన్‌ రాయల్స్‌.. లక్నో సూపర్‌జెయింట్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌కు ఇది ఎనిమిదో విజయం.

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడా హాఫ్ సెంచరీలతో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. చేధ‌న‌లో నాలుగో వికెట్‌కు శాంసన్, జురెల్ మధ్య సెంచరీ భాగస్వామ్యం కారణంగా రాజస్థాన్ మరో ఓవర్ మిగిలి ఉండగానే మూడు వికెట్లకు 199 పరుగులు చేసి విజయం సాధించింది.

ఈ విజయంతో రాజస్థాన్ జట్టు ప్లేఆఫ్‌కు చేరువైంది. రాజస్థాన్ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు, ఒక ఓటమితో 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఈ మ్యాచ్‌లో ఓడిన తర్వాత కేఎల్ రాహుల్ నేతృత్వంలోని ల‌క్నో జట్టు ఐదు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది.

Updated On 27 April 2024 9:41 PM GMT
Yagnik

Yagnik

Next Story