MI vs LSG : ముంబైని ఓడించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకున్న లక్నో
ఐపీఎల్ 2024 48వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ ముంబై ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది.

Lucknow Super Giants vs Mumbai Indians Match Update
ఐపీఎల్ 2024 48వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ ముంబై ఇండియన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ముంబై నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని లక్నో 5 వికెట్లు కోల్పోయి సాధించింది. లక్నో జట్టులో మార్కస్ స్టోయినిస్ 45 బంతుల్లో 62 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 28 పరుగులు చేసి అతడికి సహకారమందించాడు.
అంతకుముందు లక్నో బౌలర్లకు ముంబై బ్యాట్స్‌మెన్ సులువుగా లొంగిపోయారు. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై జట్టులో నెహాల్ వధేరా అత్యధికంగా 46 పరుగులు చేయగా, టిమ్ డేవిడ్ 35 పరుగులు చేశాడు. కాగా, ఇషాన్ కిషన్ 32 పరుగులు చేశాడు. లక్నోకు ఇది ఆరో విజయం కాగా, ఈ సీజన్‌లో ముంబైకి ఏడోసారి ఓటమి తప్పలేదు.
